SATYA PAVAN GANDHAM

Classics Fantasy Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Classics Fantasy Inspirational

"మూగ మనసులు - 4"

"మూగ మనసులు - 4"

4 mins
267


మే 26, 2014

ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను, జాబ్ సెర్చింగ్ కోసమని సిటీ కి ప్రయాణమయ్యాను.

ఎప్పుడూ కుటుంబానికి, ఊరికి దూరం గా ఉండని నేను, వాళ్ళని విడిచి వెళ్తున్నాననే బెంగ ఒకవైపు,

మళ్లీ ఆ అమ్మాయి ఇక కనిపించదేమోనన్న దిగులు ఇంకోవైపు.

బస్సెక్కే ఆ ఆకరి క్షణంలోనైనా నా ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్పాలనిపించింది.

కానీ, బయట పడలేక నా మనసుని పాతరేస్తూ తన ఊహలతోనే విహరిస్తూ ప్రయాణం సాగించాను.

                         ************

జూలై 26, 2014

హైదరాబాద్ వచ్చి నెలలు గడుస్తున్నా.. ఏదొక ఉద్యోగంలో స్థిరపడి బిజీ గా గడపాల్సిన నేను, ఇంకా ఉద్యోగ వెతుకులాటలోనే బిజీ గా ఉండాల్సి వచ్చింది.

ఇంతలో ఒక మంచి ఎంఎన్సి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కొంచెం కష్టపడితే ఈ ఇంటర్వ్యూ ఎలాగైనా క్రాక్ చెయ్యొచ్చు, దాంతో లైఫ్ సెటిలైపోతుంది.

నా ఆశ కి తగ్గట్లే ఇంతకముందు ఇంటర్వ్యూలలో కంటే చాలా బాగా పర్ఫామ్ చేశాను ఆ ఇంటర్వ్యులో.

దాంతో ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయిన చాలా కొద్ది మందిలో నేనొకడిని అయ్యాను.

ఫైనల్ రౌండ్ ఎప్పుడెడెప్పుడు క్రాక్ చేసీ, ఈ జాబ్ కొడదామా అన్న తపన నాలో రగులుతూనే ఉంది. (పట్నంలో నిరుద్యోగంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వేదన అటువంటిది మరి.)

ఇంతలోనే రిసెప్షన్ దగ్గర నుండి పిలుపొచ్చింది.

"Mr. సతీష్...!

Mr. సతీష్...!!

(అప్పటికే ఆలోచనలతో ఊగుతున్న నాకు ఆ పిలుపు రెండో సారికిగానీ వినిపించలేదు.)

హా.. "ఎస్ మేడం.!"అని బదులిచ్చాను వెంటనే తేరుకుని.

"Mr. సతీష్...!

మీట్ మిస్ స్పందన the HR."

అని రిసెప్షనిస్ట్, ఆ పేరు చెప్పగానే..

ఒక్కసారిగా నాలో అయోమయం అలుముకుంది.

మళ్ళీ అడిగాను ఆమెను "can you say it again" అని.

ఆ రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే రిప్లై ఇచ్చింది.

మీట్ మిస్ స్పందన the HR, For your final round of the interview అని.

ఎందుకో తెలియని ఆత్రుత, తపన, ఆందోళన, ఆశ్చర్యం అన్నీ కలగలిసి ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి.

అప్పటివరకు మామూలుగా స్పందించిన నా హ్రుదయం.. స్పందన అనే పేరు వినగానే అతిగా స్పందించడం మొదలెట్టింది.

డోర్ దగ్గర నిలబడి,

Can I get in ma'am అనే నా రిక్వెస్ట్ కి,

బదులుగా "ఎస్ కమిన్ mr. సతీష్" అంటూ నా వైపు తిరుగుతూ నన్ను లోపలికి పిలిచింది ఆ HR స్పందన.

ఆ రోజు నేనక్కడ చూసిన ఆ స్పందనకి, ఈ రోజు ఇక్కడ చూస్తున్న ఈ స్పందనకి అసలు పోలికే లేదు. ఇద్దరి కట్టూ బొట్టూ లలో చాలా వ్యత్యాసం కనిపించింది.

ఇద్దరూ ఒక్కరు కాదు లే అని కన్ఫర్మ్ చేసుకున్నాను.

బహుశా ఈ సిటీ లో పెరిగిన అమ్మాయిలందరి వేషధారణలు ఇలానే ఉంటాయి కాబోలని మనసులో అనుకున్నా...

ఎందుకో...! ఈ స్పందన ఆ స్పందన ఒకటి కాదని నాకనిపిస్తున్నా... నా అలోచనలన్ని దారి మళ్ళాయి. ఆ రోజు తన అరచేతి మీద చూసిన పుట్ట మచ్చ కోసం ఈమె చేతి పై వెతకసాగాను. కానీ, తన చేతులు బల్లకి ఆన్చి ఉండడం వల్ల నేను పెద్దగా గమనించలేకపోతున్నను.

ఆమె పరిసరాలను పదె పదే నా కళ్ళతో తడుముతూ ఆ శ్రీ శ్రీ బుక్ కోసం వెతుకుతున్నాను.

ఈలోపే ఆమె నాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా (ఇంటర్వ్యూ పర్పస్).. నేను ఇంకెక్కడో ఆలోచిస్తూ నా నోటికొచ్చిన జవాబులతో బదులిస్తున్నాను.

అసలు తనేం అడుగుతుందొ, నేనేం చెప్తున్నానో కూడా తెలియకుండా ఉంది నా పరిస్థితి ఆ పేరు (స్పందన) విన్నప్పటి దగ్గరనుండి.

చివరికి HR కి విసుగు పుట్టింది కాబోలు...

చిటికేస్తూ....

"Hello.. mr satish...

R u want this job or not ??

Why r u not responding for the questions, While I'm asking. And whr r u thinking right now. If you are not interested with this job, you may go out please. Don't waste my time."

ఆమెకు నాపై రగినలిన కోపానికి తేరుకున్న నేను...

వచ్చిన అవకాశం పోగుట్టుకున్నానేననిపించింది.

ఇక తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మారు మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేసాను.

                         ************

ఆగస్ట్ 25, 2014

పగలు జాబ్ కోసం, రాత్రిళ్ళు తన కోసం నెరవేరనటువంటి పగటి కలలు కంటూ అనుక్షణం నిరాశతో సావాసం చేస్తూన్న నాకు...

ఈ రోజెందుకో ఒంటరిగా వెళ్తుంటే దారిలో ఒకమ్మాయి ఎదురయ్యింది.

ఒక చేతిలో శ్రీ శ్రీ పుస్తకం, మరొక చేతితో విరబూసిన తన కురులను సరిచేసుకుంటూ...తన చూపులు నేలను చూస్తున్నాయి.

ఆ అరచేతిలో గల పుట్టుమచ్చ,

నిండైన అలంకారంతో నన్ను చేరబోతూన్న..

తనని చూస్తుంటే తనే నా స్పందనేమోననిపించింది.

ఎదురుపడ్డ నన్ను చూసేందుకు తన తల పైకెత్తి, ఇన్నాళ్లు నాకందకుండా నాతో ఆడుకుంటున్న తన రూపాన్ని చూపుతున్న ఆ టైంకి ...

సరిగ్గా నా మొబైల్ నుండి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ తో ఉలిక్కిపడి చుట్టూ చూసాను.

తను ఎక్కడ కనిపించలేదు.

నేను బెడ్ పై ఉన్నాను.

నేను కన్నది కలని, ఆ కల చెదిరిందని అర్థమవడానికి నాకెంతో సమయం పట్టలేదు.

అసలే ఇలాంటి వాటికి దూరంగా వుండే నేను, కనిపించకుండా నాతో ప్రతిసారీ దాగుడు మూతలాడుతున్న ఆ చిన్నదాని కోసం ఎందుకు పరితపిస్తున్నానోన్నన్న అర్ధంకాని ఆలోచనలు నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

ఇక, నాకొచ్చిన ఆ కలను చెడగొట్టిన ఫోన్ ని ఆవేశంగా నా చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడే ఆ మెసేజ్ కనిపించింది.

నెల రోజులు క్రితం నేను ఇంటర్వ్యు కి అటెండయిన కంపెనీ నుండి వచ్చిన మెసేజ్ అది.

"Dear Satish...

We are pleased to inform you that you have been selected in the final round of the interview which was conducted on 26 july 2014. You have been appointed as well.

We Hope, you will reply on the offer leter as soon as possible, which we sent your mail " అని ఆ సందేశం యొక్క సారాంశం.

అసలు ఆ రోజు ఫైనల్ రౌండ్లో ఆ స్పందన (HR) సంధించిన ప్రశ్నలకి నేనేం పెద్దగా స్పందించకుండా ఇంటర్వ్యూ నుండి బయటకి వచ్చేసినా .. ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో, అసలిప్పుడు దీనికెలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు.

కానీ, తలుపు తట్టిన ఆ అదృష్టాన్ని వదులుకోవాలనిపించలేదు.

అంతా ఈ రోజు నా కలలో కలవరపెట్టిన నా స్పందన మహిమేమోననుకున్నాను.

తన రూపమెంటో తెలియకపోయినా, కేవలం తన ఊహలతోనే నా కలలో తనని ఆరాధిస్తున్న నాకు, ఆ ఆరాధన కూడా అదృష్టంలా వరించినట్టనిపించింది. ఒకవేళ, తనే నా జీవిత భాగస్వామైతే నా అంత అదృష్టవంతుడుండడనిపించింది.

                         ************

అక్టోబర్ 03, 2014

అప్పటికే సిటీ కి వెళ్లి చాలా రోజులు గడుస్తున్నా... ఇంటి మొహం చూడడం లేదని ఇంట్లో వాళ్ళ గొడవ.

దసరా కదా ఓ మూడు రోజులు సెలవలు కావడంతో ఇంటికి వచ్చాను.

ఈ రోజు దశమి ఆఖరి రోజు, పైగా పక్కనే ఉన్న దుర్గ గుడిలో దేవతని ఊరంతా ఊరేగిస్తారు.

ఈ ఊరేగింపు వంకతో ఊరంతా జల్లెడ పడితే, ఈ సారైనా తనని చూడగలనన్న ఆలోచన నా తాపత్రయానికి ఆయువు పోసింది,

ఈ రోజెక్కడైనా ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని దూరని సందంటూ లేదు, వెతకని ఇళ్ళంటూ లేదు.

కానీ, ఊరంతా తిరిగిన నాకు చివరకు మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. తను ఎక్కడా కనిపించలేదు.

ఇక నాకున్న చివరి అవకాశం రెండ్రోజుల్లో రానున్న ఆదివారం.... లైబ్రరీ... ఆ శ్రీ శ్రీ బుక్...

                         ************

చాలా ఇంటరెస్ట్ గా చదువుతున్న రఘు తర్వాత పేజీ తిప్పబోయే సరికి... వాళ్ళమ్మ వచ్చి

"ఎప్పుడూ పుస్తకాల వంక కన్నెత్తి కూడా చూడని నువ్వు, ఈ రోజెంట్రా ?.. పొద్దుట నుంచి ఒకటే పుస్తకం చదువుతున్నావు.. అసలేముంది ఆ పుస్తకంలో?" అని ఆరా తీస్తూ దగ్గర రాబోతుండడంతో, హడావిడిగా ఆ డైరీ మూసి లోపల పెట్టేసి, విషయం పక్కదారి పట్టించాడు రఘు.

రఘు మరలా వచ్చి ఆ డైరీలో ఏం కొనసాగించడన్నది తెలుసుకోవాలంటే మూగ మనసులు - 5 వరకూ ఆగాల్సిందే..

To be continued in next part...

రచన:

సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Classics