Dinakar Reddy

Abstract Tragedy

4  

Dinakar Reddy

Abstract Tragedy

మనసు కుదుటపడదే

మనసు కుదుటపడదే

2 mins
309


చాలా రోజులైంది బాబూ నిన్ను చూసి. ఈ మధ్య రావడం లేదే అని పలకరించారు పంతులుగారు. పెరిగిన జుట్టూ మాసిన గెడ్డంతో ఉన్న నన్ను చూసి ఎవరో అనుకుని పలకరించి ఉంటాడేమో. నేను ఏదో అనేంతలో ఎవరో అర్చన చేయమనడంతో మళ్లీ ఆయన గర్భగుడిలోకి వెళ్ళిపోయారు.


రెండు నెలల క్రితం అనూతో వచ్చాను ఈ గుడికి. నేను గెడ్డంతో ఉన్నప్పుడే హ్యాండ్సంగా ఉంటానని తను చెప్పడంతో నాకు చిరాకు అనిపించినా ఆ రోజు నుంచే గెడ్డంతో ఉండటం అలవాటు చేసుకున్నాను.


కానీ నెల రోజుల క్రితం ఓ రోజు తను నన్ను ఇంటికి రమ్మనడంతో వెళ్ళాను. ఆశ్చర్యంగా అనూ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు.


ఆయన ఒక్కటే చెప్పారు. అనూకి మంచి సంబంధం వచ్చింది. నాకంటే కెరీర్లో బాగా సెటిల్ అయిన అబ్బాయి. పైగా ఆస్తిపరుడు అని.


అనూ మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ నాన్న నన్ను పిలిచి మాట్లాడాలని చెప్పి ఇలా పెళ్లి సంబంధం గురించి చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.


సంబంధం చాలా మంచిదని నా కుటుంబ పరిస్థితిని మళ్లీ మళ్లీ గుర్తు చేశారు. నా చేతులు పట్టుకుని ఇక మీదట అనూతో ఎప్పుడూ మాట్లాడొద్దు అని ఒట్టు 

వేయించుకున్నారాయన.


నేను మాట్లాడకుండా బయటికి వచ్చేసాను. అనూకి కూడా తెలిసే వాళ్ళ నాన్న ఇలా మాట్లాడి ఉంటారా? లేదు లేదు. అనూ నన్ను ప్రేమిస్తోంది. అది నిజం.


కానీ నాన్న. నాన్నను ఎదిరించి అనూతో జీవితాన్ని పంచుకోగలనా? ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యాను. ఆరోజు నుంచి అనూని కలవలేదు. మాట్లాడలేదు.


ఆఫీసుకి వెళ్లి వచ్చి అదే ఆలోచిస్తూ కూర్చుంటూ ఉన్నాను. ఏదో రిలీఫ్ గా ఉంటుంది అని గుడికొచ్చాను.


నేను మోసగాడినా. భయస్తులందరూ మోసగాళ్లేనా. ఏమో. కానీ నాన్నను ఎదిరించి పెళ్లి?.. నా వల్ల కాదు.


గుడిలో నుంచి వచ్చేస్తూ పక్కన ఉన్న కిటికీలో చూశాను. శుభలేఖలు. దేవుడి దగ్గర ఆశీర్వాదం కోసం పెట్టి తరువాత బయట పెట్లినట్టున్నారు.


ఎందుకో చేతిలోకి తీసుకుని చూశాను.

రెండో శుభలేఖ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అనూ వెడ్స్ మహిధర్ అని ఉంది. అనూ ఫోటో మాత్రమే శుభలేఖ లోంచి కట్ చేసుకుని జేబులో పెట్టుకున్నాను.


రాత్రి టీవీలో రాజా రాణి సినిమా చూస్తున్నారు అందరూ. నాకెందుకో ఆ సినిమాలో సూర్య పాత్రని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపించింది.


అందరి ప్రేమలూ సక్సెస్ కావు కదా. కానీ జీవితం ముందుకు వెళ్లాలి. అలానే ఆనందాన్ని అలవాటు చేసుకోవాలి.


నా కథలో ఇన్స్పైర్ చేసే విషయం లేదు కదూ అనిపించింది. భయం అంతే. ప్రేమను చంపేస్తుంది. కాదు కాదు దాచిపెట్టి కొద్ది కొద్దిగా చిత్రవధ చేస్తుంది.

పుస్తకంలో నేను దాచిన అనూ ఫోటో గుర్తుకు వచ్చి మనసు భారంగా అనిపించింది.


కళ్ళు మూతలు పడుతున్నాయి. 



Rate this content
Log in

Similar telugu story from Abstract