మహనగరం
మహనగరం
ఓ మహానగరమా!!!
నిద్ర లేని నీకు ,
ఆకలి అవ్వని నీకు,
చలి చక్కిలి దూరని నీ ఒడిలో కి
ఎందరినో అక్కున చేర్చుకునీ
అందరినీ నీ నగరపు వాతవరణం నీ అలవాటు చేస్తూ.. ఎప్పటికీ అందరినీ అప్డేట్ చేస్తూ,
ఎందరికో కొలువులు ఇస్తు,
ఆశ్రయం ఇస్తూ,
నీ దగ్గరికి వలస వచ్చే వారికి ప్రయాణ సౌకర్యాలను ఇస్తు,
ఆడపిల్ల రక్షణ కోసం నీలి నీడ లాంటి, విధానాలు పాటిస్తూ,
విద్యార్థి లకి చదువులు చెప్పుతూ,
చదువు అయ్యాక కొలువు ఇస్తూ,
కొలువు తీరిన వారికి
పెళ్లి కుదిరిస్తు
నీ అక్కున చేర్చుకునటునవ్!!
పొట్ట పట్టుకుని వచ్చిన కూలీ కి పని కల్పించి ,వాడికి పట్టెడన్నం పెట్టీ వాడి కుటుంబం నీ పోషించుకునే లా తీర్చి దిద్ది..
ఇలా అందరినీ రక్షిస్తూ,రక్షణ ఇస్తు
నిన్ను నువ్వు హంగులు అడ్డుకుంటూ
ప్రపంచ ప్రఖ్యాతి గావిస్తు నువ్వు ఎదుగుతున్న తీరు అద్భుతం!!!
ఓ మహనగరమా!!!!
