Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

ranganadh sudarshanam

Comedy

4.5  

ranganadh sudarshanam

Comedy

గణపయ్య స్ట్రోక్...శంకరయ్య షాక్

గణపయ్య స్ట్రోక్...శంకరయ్య షాక్

3 mins
545



...................

శంకరయ్యకు వినాయక చవితి వస్తున్నదంటేనే ...ఎక్కడలేని భయం పట్టుకుంది.

బజార్లో తిరిగే పొరగాళ్లందరు..

ఇక వినాయక చందాలoటూ, బేజార్ చేస్తారు.

స్వతహాగా కాస్త పిసినారి మనస్తత్వమున్న శంకరయ్య,ఈసారి ఎట్లయినా చేసి , ఈ చందా ఇవ్వకుండా తప్పించుకొవాలనుకున్నాడు.

పోయిన సారి పోరగాండ్లు,

కాక..... ఈసారి...ఇరవై అడుగుల గణపతిని పెడ్తూన్నాం...

పెద్దచెయ్యి నీదే...

పదివేలు.. రాస్తున్నాం కాక,

మొదటి పూజ,నువ్వు చిన్నమ్మ నే చెయ్యాలి అంటూ .. ..

చెవులు పిండకుండానే.. పదివేలు వసూల్ జేసిండ్రు.

మరి ...... ఈసారి ఎంతంటారో.... ఏం జేస్తారో.

అందుకే...ఎట్లా జేసైనా, ఈసారి ..మాత్రం తప్పించు కోవాలని..గట్టిగా అనుకున్నాడు శంకరయ్య.

రాత్రంతా..ఆలోచించి..ఒక ప్లాన్ తయారు చేసుకుండు.

అనుకున్నట్లుగానే...పొరగాండ్లు,పూజారి...ఇద్దరూ,ముగ్గురు బస్తి పెద్దలు..శంకరయ్య ఇంటికి చందా రాయటానికి వచ్చారు.

అబ్బ... దండయాత్ర మొదలైందిరా...దేవుడా,,

రాండి.. రాండి..మీ రోగం తిప్పుతా అనుకుఅంటూ....

తను రెడీ చేసుకున్న ప్లానుకు.. తనను తానే మెచ్చుకుంటూ..మనసులో పక పక.. నవ్వుకుoటూ...

రండి అందరూ కూర్చోండి అంటూ ఆహ్వానించాడు శంకరయ్య.

కాక ...ఈసారి ఇరవై ఒక్క అడుగుల పంచముఖ గణపతి పెడుతున్నాం..బారి చెయ్యి నీదే కాక...

అన్నారు పోరాగాండ్లు.

అవునండి... ఈ సారి ప్రశస్థoగా ఉండాలని...పెద్దలంతా నిర్ణయించారు, ఖర్చు కూడా కాస్త ఎక్కువే అవుతుంది...

అందుకే శంకరయ్య గారు.. మీరు ఈ సారి కాస్త పెద్ద మనసు చేసుకోవాలి అన్నాడు, పూజారి...

పెద్దలంతా తప్పదు అన్నట్లు శంకరయ్య వైపు చాసారు.

పార్వతి....అందరికి కాస్త టీ లు పంపించు..అంటూ పురమాయించాడు..శంకరయ్య.

పార్వతికి గుండె ఆగినంత

పనయ్యింది....

ఎంగిలి చేత్తో కాకి ని కూడా కొట్టని భర్తేనా..

ఈ మాటలంటుంది..అనుకొని ఆశర్యపోయింది.

శంకరయ్య..మర్యాదలు చూసి భారీగానే చందా ఇవ్వ బోతున్నాడునుకున్నారు వచ్చిన వాళ్లంతా.

శంకరయ్య మాత్రం... లోలోపల పగలబడి నవ్వుకుంటూ...డబ్బులు మిగుల్చుకునే తన తెలివితేటలకు...సంతోషపడుతూ....ఈ "టీ లే తప్ప మీకెమి దక్కనియ్యను...అనుకున్నాడు గర్వాంగా.

కానీ తానొకటి తలిస్తే..భగవంతుడు ఒకటి తలుస్తాడాని..

తెలుసుకోలేక పోయాడు... పూర్ శంకరయ్య.

అందరూ టీ లు తాగాక...

మీరంతా ఈసారికి నన్ను మన్నించాలి, మీరున్నట్లు ఈసారి చందా బాగానే రాద్దాం అనుకున్నా..

కానీ .....అంటూ నసిగాడు శంకరయ్య.

చెప్పుకాక... ఏమైందే అన్నారు పోరాగాండ్లు...ఆతృతగా...

అదేంటంటే..పోయినసారి నాకు బండి ఆక్సిడెంట్ అయినప్పుడు...

చల్లగా చూడు తండ్రి...ఈ గండం తప్పితే.. ఈసారి గణపయ్యను ఇంటిముందు ఏర్పాటు చేసి నవరాత్రులు ఘనంగా పూజిస్తామని మొక్కిందట నా భార్య.

మరి మొక్కు తీర్చుకోవాలి కదా,..

అందుకే ఈసారికి నన్ను వదిలేయండి...ఇంటిముందు చాలా ఖర్చుంది అన్నాడు శoకరయ్య, లోపలి..సంతోషాన్ని... బైటికి విచారంలా వ్యక్తపరుస్తూ..

అందరూ..తెల్ల మొఖాలేసి..ఓకరి నొకరు చూస్యూకున్నారు.....

ఈ మాటలు విన్న పార్వతికి..బుర్రతిరిగి,వళ్లంతా చెమటలు పట్టి... చెంబెడు మంచినీళ్లు...గడ.. గాడా..ఆపకుండా.. తాగింది..

ఆరి పాపిష్టి మొగుడా...నీ పిసినారి తనం గంగలో కలువ..దేవుడిమీద కూడా అబద్దాలా....

రామ..రామ..ఈ పాపం లో నాకు మాత్రం భాగం లేదంటూ..గణపతి ఫోటో దగ్గరి కెళ్ళి రేండు చెంపలు పెళ్లు.. పెళ్లు నా వాయించుకొని ముక్కు నేలకు రాసింది పార్వతి.

వాళ్ళ మొఖాలను... చూసి..తన ప్లాన్...వర్కౌట్ అయినందుకు..లోలోన..పగలబడి నవ్వుకున్నాడు శంకరయ్య.

ఏదో ఓ. ..చిన్నపాటి విగ్రహాన్ని ఇంటిముందు పెట్టి..ఇంట్లో చేసే ఆ పూజేదో బైట చేసి..మమా... అనిపిస్తే..డబ్బు మిగులుతుంది..పుణ్యం వస్తుంది.. అనుకున్నాడు శంకరయ్య.

అందరూ మెల్లగా షాక్.. లోంచి తెరుకున్నారు..ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని..లేవబోయారు...

ఇంతలో అరే.. కాక ఎందుకు పరేషాన్ అవుతున్నవే.... మన బస్తీల ఇప్పటిదాకా..ఎవ్వరు రెండో విగ్రహం పెట్టలేదు..పెట్టొద్దు ..అది మన బస్తి కట్టుబాటు...

ఇప్పుడు నిన్ను వద్దందామా,

సెంటిమెంటు..

చిన్నమ్మ మొక్కాయే...

అందుకే ఒక పని చేద్దాం కాక.....

బస్తి కట్టుబాటుకు...

నీ మొక్కుకు తిప్పలు లేకుండా,

ఈ సారికి బస్తి గణేశున్ని మీ ఇంటిముందే పెడదాము కాక..ఆన్నారు....

అందరూ సరే అన్నారు.

వూహించాని.. ఈ దెబ్బకు శంకరయ్య..బిత్తరపోయాడు,గొంతు ఎండి పోయింది.. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు,ఏవరో పిడితో ...తలమీద గుపికి..గుపికి.... బాదుతున్నట్లనిపించిoది..

జేబులోనుంచి ఓ బి.పి . గోలి తీసి గొంతులో వెసుకొని,పక్కనే ఉన్న బాటిల్ నీళ్లు గబ.. గబా... తాగాడు శంకరయ్య.

తలుపు చాటున ఇదంతా వింటున్న పార్వతి...ఆనందంతో మనసులో.. ఓ తీన్మార్..దరువు ఏసుకుంది.

గణపతి నవరాత్రులు బాగా జరిగాయి...శంకరయ్య ఇంటిముందు కావడంతో..ఖర్చు వాసిపోయింది....

ఏటా.. లడ్డు వేలంపాటలో లక్ష పై చిలుకు వచ్చేది ....ఆ డబ్బులు శోభా యాత్రకు సరిపోయేవి...

కానీ బస్తి వాళ్లంతా...శoకరయ్య కు మొక్కoదని..ఎవ్వరు వేలంపాటలో ముందుకు రాలేదు..

దాంతో.. శాంకరయ్య ఖర్చు మరింత పెరిగి బ్యార్ మాన్నాడు...

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు..శoకరయ్య శోభా యాత్ర,నిమజ్జనం పూర్తిచేసుకొని,వచ్చే టప్పుడు..కిందపడి బాగా దెబ్బలు తగిలాయి..

ఈసారి..నిజంగానే..పార్వతి

తన మాంగళ్యాన్ని ..

కాపాడమని..వచ్చేఏడు... ఇంటిముందు గణపతిని..పూజిస్తామని మొక్కుకుంది..

ఆమె.. మొక్కుల పుణ్యమో... అదృష్టమో..మొత్తానికి శంకరయ్య బ్రతికి బైట పడ్డాడు.

.............

తుఫాను కారణంగా జోరును వర్షాలు , ముసురు పెట్టడంతో...రెండవ సారి ..ఏర్పాట్ల ఖర్చు తడిసి మోపెడయ్యింది..శంకరయ్యకు

కాని ఈసారి,ఖర్చుకు వేరవ కుండా.. శంకరయ్య..

పశ్చత్తాపంతో..భక్తితో.. గణపతిని పూజించాడు.

.....

కానీ. ..రెండు సార్లు పూజ చేసి వదిలేస్తే ..అరిష్టం అని..

మూడవసారి కూడా ఇంటిముందు చేస్తేనే మంచిదని..అందరూ అనడంతో..

కళ్ళు బైర్లు కమ్మి కిందపడ్డాడు శoకరయ్య..

మొఖం మీద.. నీళ్లు చల్లిన..

పార్వతిని చూసి..షాకలో

నీనెక్కడున్నాను అంటూ..

గుడ్లు మిటకరించాడు.

డబ్బులు పోయిన... తన భర్తకు..తగిన శాస్తి జరిగిందని, దేవుణ్ణి..అన్నివిధాల పూజించే అవకాశం కలిగిందని...

సoతోశించింది..పార్వతి..

.............సమాప్తం........


మనము...మంచి మనసుతో.. ఆ..గణనాదున్ని పూజిoచి తరిద్దాం.



Rate this content
Log in

More telugu story from ranganadh sudarshanam

Similar telugu story from Comedy