గజ్జల చప్పుడు
గజ్జల చప్పుడు


దయ్యాలు ఉన్నాయా ..లేవా?
లైవ్ టాపిక్ పై టీవీలో ప్రసారమవుతున్న డిబేట్
లో ప్రముఖ నాస్తిక వాది శ్రీకాంత్ తన వాక్పటిమతో అందరిని ఆదరగొట్టేశాడు.
ఆత్మలుంటే దయ్యాలుకూడా ఉన్నాయన్న..వాదనను...
దేవుడిని నమ్మినప్పుడు దయ్యాలను కుడా నమ్మాలన్న వాదనను గట్టిగా తిప్పికొట్టాడు శ్రీకాంత్.
తన వాదనను కొనసాగుస్తూ..
అలా అయితే..మరి మనిషి దయ్యలే కాదు... చీమ దయ్యాలు,దోమదయ్యాలు, కుక్కదయ్యాలు ఇలా ఆత్మ ఉన్న అన్నింటికి దయ్యాలు ఉండాలిగా..
మరి అప్పుడు బ్రతికిన జీవుల సంఖ్య కంటే చచ్చిన వాటి సంఖ్యే ఎక్కువ..అప్పుడు మరి అన్ని ఎక్కువ దయ్యాలు ఉన్నప్పుడు అవి ఎందుకు కనపడటం లేదు.. మనలా మిగిలిన అన్నీజంతువులు..పక్షులు కీటకాలు..వాటి వాటి దయ్యాలకు ఎందుకు భయపడటం లేదు.
ఇలా సాగిన తన వాక్ప్రవహాన్ని...ప్రత్యర్థులు అడ్డుకోలేక పోయారు.
లైవ్లో కాలర్లు కూడా తనను ఎక్కువగా సమర్దించారు.
డిబేట్ ముగిసింది...
బైటికి వచ్చి సిగరేట్ వెలిగించాను, డిబేట్ చాలా సంతృప్తిగా అనిపించింది.అది విజయ గర్వం కావచ్చు.
రాత్రి పది గంటలు దాటింది..సన్న చినుకులుగా వర్షం ప్రారంభం అయింది.
తాను ఇంటికి చేరాలంటే రెండు గంటలు పడుతుంది.
లాస్ట్ పఫ్ ఫినిష్ చేసి సిగరేట్ పీకను బూటకాలి తో తొక్కేసి, కార్ స్టార్ట్ చేసాను.
వర్షం పెద్దదైయింది..ఉరుములు మెరుపులతో వాతావరణం బీభత్సంగా మారింది.
కారు వైపర్లు ఫుల్ స్పీడ్ గా పనిచేస్తున్నాయి.
కారు రోడ్డు పై నీళ్లను చీల్చుకుంటూ ...దూసుకెళుతుంది.
మరో అయిదు నిముషాల్లో ఇల్లుచేరుతాను అనుకుంటుండగా..కారు ఒక్కసారిగా పెద్దగా శబ్దం చేస్తూ రోడ్డు దిగి..ప్రక్కనే ఉన్న సమాధిని ఢికొట్టింది,సడన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది .
ఒక్క సారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానానికి నా మైండ్ బ్లాక్ అయింది ..
కాస్త తేరుకొని కారుదిగి మొబైల్ లైట్ ఆన్ చేసి చూసాను...బ్యాక్ టైర్ బరస్ట్ అయ్యింది. వర్షo మరింత తీవ్ర మైంది..చినుకులు సూదుల్లా గుచ్చు కుంటున్నాయి.
కార్లో సమయానికి స్టెపిన్ టైర్ కూడా లేదు..ఏం చేయాలో అర్థం కాలేదు.
కార్లో కూర్చొని..సిగరెట్ వెలిగించాను...అప్పుడప్పుడు ఆకాశాన్ని చీల్చుకొని వస్తున్న మెరుపులు నింగినుండి నేలకు..నిప్పుల గీతలు గీస్తూ.. మాయమౌతున్నాయి.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కుండపోతగా మారింది.
పక్కనే ఆరిపోయిన చితినుండి వ్యాపిస్తున్న పొగ వాసన కడుపును దేవేస్తున్నట్లుంది.
దూరoగా నక్కల ఊలలు భయంకరంగా వినిపిస్తున్నాయి.
సగం కాలిన శవాన్ని అవి భయంకరంగా పీక్కు తినడం మెరుపు వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది.
తన కారు వూరి పొలిమెర లో ఉన్న స్మశానంలో ఆగినట్లుంది..ఇప్పుడెలా అర్ధరాత్రి ఒంటరిగా స్మశానం మధ్యలో..తెలియకుండానే ఒక్కసారిగా భయం అనిపించింది.
ఛ..ఛా..తనేనా ఇలా భయపడుతుంది..అసలు దయ్యాలే ఉండనప్పుడు....మరి భయమెందుకు అనుకున్నాను.
కానీ సహజంగా మనిషి భయస్థుడు..ఈ భయానికి కారణం ప్రాణం మీది తీపి కావచ్చు లేదా చిన్నప్పటినుoడి,పెరిగిన వాతావరణం కావచ్చు...
అదిగో దయ్యం..
దయ్యాల పాదాలు వెనుకకు తిరిగి ఉంటాయి
దయ్యాలు తెల్లని బట్టలు కట్టుకుంటాయి
చీకట్లో దయ్యలుంటాయి
కొరివి దయ్యాలు&
nbsp;నిప్పుల కుండతో వస్తాయి
చచ్చిన వాళ్ళు దయ్యం అవుతారు..
అర్ధరాత్రి అమవాస్యరోజు దయ్యాలు తిరుగుతాయి..
దయ్యాలను చూసి కుక్కలు మొరుగుతాయి..
ఇలాంటి చెత్త oతా మెదళ్ళలో జొప్పించి... ఇండైరెక్టుగా మనలో భయాన్ని నింపి పెట్టడం వల్ల..
అసలు ఉందొ లేదో..
ఎవరైనా చూసారా లేదో ...తెలియని దయ్యానికి, మనం ఎంత దైర్యంగా ఉన్నా
ఈ భయాలు ఒంటరిగా ఉన్నప్పుడు
మనకు తెలియకుండానే మనను భయపెడతాయి.
అంతా ట్రాష్ అనుకున్నాను.
ఇక లాభం లేదనుకొని.. కారు దిగి నడక ప్రారంభిద్దామని అనుకొన్నాను..
వేగంగా నడిస్తే..పదినిముషాల్లో ఇంట్లో ఉండొచ్చు అనుకొని..
మరో సిగరెట్ వెలిగించి పొగ గుండెలనిండా పీల్చుకొని.. మొబైల్ లైటింగ్ సహాయంతో నడక ప్రారంభించాను. వర్షం తగ్గింది కానీ వరద నీళ్లు వేగంగా కాళ్ళను తగులుతూ పోతున్నాయి..
నడుస్తున్న నా కాళ్లకు ఎదో అడ్డుపడ్డట్లనిపించి చూసాను..సగం కాలిన మనిషి చెయ్యి..
భయంతో నెట్టి వేసాను.
దూరంగా గుడ్లగుబా అరుపు నిశీధిలో భయంకరంగా వినిపిస్తుంది.
చెట్లను తాకుతూ వీస్తున్న గాలి భయంకరంగా శబ్దం చేస్తుంది.
తెలియని భయం ఆవరించింది..
ధైర్యం కూడగట్టుకొని నడవటం ప్రారంభించాను.
అడుగు వేయగానే..ఘల్ మని శబ్దo
మళ్ళీ అడుగు వేసాను..ఘల్ మని శబ్దం
వేగంగా అడుగులు వేస్తున్నాను
ప్రతి అడుగుకు..ఘల్..ఘల్.ఘల్ శబ్దం వస్తుంది.
వెన్నులో సన్నగా వణుకు ప్రారంభం అయింది.
నడవడం ఆపాను
శబ్దం ఆగిపోయింది..
మళ్ళీ అడుగు వేసాను
మళ్ళీ ఘల్ మంది
భయం..పెరిగింది..
దయ్యం లేదని వాదించాననే కోపంతో దయ్యం తనను పరిచయం చేసుకోవడానికి వచ్చిందా అనుకున్నాను.
మనిషిలో ధైర్యం సన్నగిల్లగానే...భయం విజృంభిస్తుంది.. ఆ భయమే మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. శ్రీకాంత్ ఇప్పుడదే స్థితిలో ఉన్నాడు.
ఇక లాభం లేదని భయంతో పరుగు ప్రారంభించాను..ప్రతీ అడుగుకు శబ్దం నాతోపాటే.. పరుగెత్తుకొస్తుంది.
ప్రాణాలు పోతున్నట్లనిపించింది ..ఆయాసం వస్తుంది కాని చప్పుడు ఆగటం లేదు నన్ను వెంబడిస్తూనేవుంది.
పరుగెడుతున్నాను..మరింతవేగంగా..
ఇంకావేగంగా..
నా అడుగులతో పాటే.. నాతోపాటే..
ఘల్..ఘల్..ఘల్ ఘల్ ఘల్..భయంకరంగా వినిపిస్తుంది.
ఒక్కవుదుటున గేట్ తోసుకుని ఇంట్లొకొచ్చాను, కాలికేదో అడ్డు పడింది..దబెల్లున క్రింద పడ్డాను..నా జేబులో ఉన్న తాళాల గుత్తి ఘల్ మంటూ బైటికి ఎగిరి పడింది.
కంగారులో చూసుకోలేదు ...భయం భయంగా లేసాను....చుట్టూ పరికించి చూసాను..ఏమి కనపడలేదు..నా అనుమానం నివృత్తి చేసుకోడానికి..మరో అడుగు వేశాను శబ్దం రాలేదు. కాస్త ధైర్యం వచ్చింది..మరో అడుగు..మరో అడుగు వేసాను...శబ్దం ఆగిపోయింది.
హమ్మయ్య..అనుకున్నాను.
లైట్ వేసాను..దూరంగా పడిన తాళాలు గుత్తి వెక్కిరిస్తూ కనిపించింది.
అప్పుడర్థం అయ్యింది ..
భయం..ఎంత భయంకరంగా ఉంటుందో ..
నాలాంటి వాడే బ్రమపడి భయపడితే...
మామూలు వ్యక్తులు బయపడటంలో దయ్యాలను నమ్మడంలో ఆశ్చర్యం లేదనిపిo చింది.
అందుకే మనిషిలో గూడుకట్టుకున్న ఈ భయమే
దయ్యం..
భూతం..
పిశాచి..
అనిపించింది...
.........సమాప్తం....