ఎవరు - 1
ఎవరు - 1
ఇద్దరు హంతకులు , ఒక హత్య , వేరు వేరు సమయాల్లో ( 3 రోజుల కింద )
భూషణ్ : రంగయ్య ! రంగయ్య
రంగయ్య : అయ్యా
భూషణ్ : భోజనం చేసి పడుకో . ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాను
రంగయ్య : అలాగే నయ్య
-------------------------------
ప్రముఖ పారిశ్రామికవేత్త భూషణ్ గారి దుర్మరణం . ఇది హత్య లేదంటే ఆత్మహత్య అనే కోణం లో విచారిస్తున్న పోలీసులు
ఫాంహౌస్ కి చెరుకున్న ఇంటెలిజెన్స్ & ఫోరెన్సిక్ నిపుణులు
SI రంజిత్ : చెప్పండి రంగయ్య అస్సలు రాత్రి ఏమి జరిగింది
రంగయ్య : సార్ పిలిచి భోజనం చేసి పడుకోమన్నాడు అయ్య
నేను నా రూం కి వెళ్లి పడుకున్నాను . పొద్దున అయన రూం లో పేపర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇలా చూసాను అయ్య .
అంతకు మించి నాకేం తెల్వదు సార్
SI : ఇయాన భార్య , పిల్లలు
రంగయ్య : ఎప్పుడు వచ్చినా ఒక్కడే వస్తాడు సార్ , అప్పుడప్పుడు కొంతమంది వస్తుపోతూ ఉంటారు . భార్య , పిల్లలు ఎప్పుడో ఒకసారి వస్తుంటారు సార్
SI : వాళ్ళకి సమాచారం అందించారా
రంగయ్య : వాళ్ళు 3 రోజుల కింద బందువుల వివాహానికి బళ్ళారి వెళ్ళారు .సార్ కి ఏదో పని ఉండటం వల్ల నిన్నే తిరిగి వచ్చారు . చెప్పాను సార్ బయలుదేరారు
SI : ఇంట్లో సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయ్ . అవి చుడొచ్చా
రంగయ్య : ఉన్నాయి సార్ కానీ అవి పనిచేయడం లేదు . టెక్నీషియన్ కి నిన్న రమ్మని చెప్పాను కానీ ఇంకా రాలేదు సార్
SI : టెక్నీషియన్ నంబర్ మా కానిస్టేబుల్ కి ఇవ్వు , అలాగే అతని షాప్ మరియు ఇటి అడ్రెస్స్ కూడా ఇవ్వండి
--------------------------------
DSP రవీందర్ : రిపోర్ట్ ఎంటి రంజిత్
SI : సార్ భూషణ్ గారి భార్య , పిల్లలు వస్తున్నారు 3 రోజుల కింద బళ్ళారి లో పెళ్లి కి వెళ్ళారు అంట , నిన్నే భూషణ్ తిరిగి వచ్చాడు , సెక్యూరిటీ కెమెరాలు పనిచేయడం లేదు , నిన్న రావాల్సిన టెక్నీషియన్ రాలేదు , కానిస్టేబుల్ కి నంబర్ ఇచ్చి వివరాలు కనుక్కొమని చెప్పాను . ఇంటెలిజెన్స్ & ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు .
DSP : ఈ కేస్ వల్ల చాలా వత్తిడి పెరుగుతుంది , అందులోనూ ఆయన SP ఫ్రెండ్ అంట గంట గంటకు ఫోన్ చేస్తున్నాడు , అందుకే నేను రావాల్సి వచ్చింది . ఈ వారం లోగా మనం హంతకుడిని పట్టుకుని తీరాలి .
నువ్వు ఒక పని చెయ్ . భూషణ్ భార్య వచ్చిన వెంటనే స్టేట్మెంట్ తీసుకో , అలాగే నెల రోజులుగా ఈ ఫాంహౌస్ కి ఎవరెవరు వస్తున్నారో ,వెళ్తున్నారో కనుక్కో , ఈ నెల రోజుల్లో భూషణ్ గారు ఎక్కడెక్కడ కి వెళ్ళారు ఏమి చేసారో కూడా కనుక్కో
అలాగే చుట్టూ పక్కల కెమెరా లు ఎక్కడ ఉన్నాయో చూడు , వాటిలో ఎవరైనా అనుమానాస్పదం గా కనిపించారు ఏమో వెతికి వాళ్ళ వివరాలు సేకరించి నాకు వాట్సాప్ చెయ్
-------------------
కొన్ని రోజుల కింద
-------------------
భూషణ్ గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు .
ఎంటి తప్పు నాకు రావాల్సిన డబ్బు కి బదులుగా నేను మీ కంపెనీ నాకు వచ్చేట్లు గా నేను ఒక కేస్ వేశాను అలాగే నాకు న్యాయం జరుగుతుంది . ఒకటి నా డబ్బు నాకు తిరిగి రావాలి లేదా నీ కంపెనీ నా చేతుల్లోకి రావాలి
సరే భూషణ్ గారు ! మంచిది . నీకు నెల రోజుల్లోగా నేను నీ డబ్బు తిరిగి ఇస్తాను మీరు కేస్ వెనక్కి తీసుకోండి
ముందు నువ్వు ఇవ్వు , ఆ తర్వాత నేను వెనక్కి తీసుకుంటా .
మంచిది భూషణ్ గారు
------------------------
SI : సార్ భూషణ్ గారిని ఎందుకు చంపారో తెలిసింది
DSP : ఎందుకు
SI : నాకు కొన్ని గంటల గడువు ఇవ్వండి అంతా తెలుస్తుంది
--------------------
8 గంటల తరువాత
--------------------
ఫోరెన్సిక్ నిపుణుడు రాజేష్ : సార్ భూషణ్ గారిని మొన్న రాత్రి 10 గంటలకు చంపారు . చాలా దగ్గర నుండి కాల్చి చంపారు . Sailencer ఉపయోగించడం తో ఎవరికి తెలియలేదు .
DSP : ఓహ్ ! అలాగా
రాజేష్ : ఇంకో విషయం సార్ , 10:40 నుండి 11 గంటల సమయం లో భూషణ్ గారిని ఇంకొక వ్యక్తి వచ్చి చంపాడు సార్ , వీపు మీద 3 సార్లు పొడిచి చంపారు సార్
DSP : ఎంటి ! నిజమా . భూషణ్ గారు చనిపోయారనే విషయం తెలిసి చంపారా , తెలియకుండా చంపారా . మరి గన్ అలాగే కత్తి దొరికిందా
SI : తెలియకుండానే చంపారు సార్ , ఎందుకంటే భూషణ్ అప్పుడు పడుకుని ఉన్నారు అలాగే ఆ సమయం లో కరెంట్ పోయింది
సార్ వ్యాపారం లో గొడవలు ఉండటం వల్ల ముఖేష్ ఈ హత్య నీ తన మనుషుల ద్వారా చేయించాడు . భూషణ్ డబ్బులు లేదంటే కంపెనీ ఇవ్వాల్సింది గా కోరాడు అది నచ్చని ముఖేష్ అతన్ని కూని చేయించాడు . కానీ అప్పటికే భూషణ్ చనిపోయిన విషయం తనకి తెలియదు . పైగా ఊరి చివర అప్పుడే కరెంట్ పోయింది
DSP : మొదటి హంతకుడి సమచారం దొరికిందా
SI : ఇంకా లేదు సర్ . త్వరలోనే ప........
రంగయ్య : సార్ . భూషణ్ గారిని హత్య జరగడానికి కొన్ని గంటల ముందు ఒకతను కలవడానికి వచ్చాడు సార్ .అప్పుడు నేను సార్ కార్లో ఉన్న బాటిల్స్ తేవడానికి వెళ్ళాను
DSP : ముఖం ఏమైనా గుర్తుపడతారా
రంగయ్య : లేదు సార్
DSP : రంజిత్ ఫాంహౌస్ కి ఎవరెవరు వస్తున్నారో వెళ్తున్నారో తెలుసుకున్నవా .
SI : వాళ్ళు ఎవరికి ఈ హత్య తో సంబందం లేదు . భూషణ్ నిన్న ఫాంహౌస్ కి వెళ్ళాడు అనే సంగతే వాళ్ళకి తెలీదు
DSP : టెక్నీషియన్ సంగతి ,
SI : సార్ టెక్నీషియన్ బార్య కి బాగోలేక పోవడం వల్ల ఆరోజు మొత్తం హాస్పిటల్ లో ఉన్నారు
DSP : భార్య సంగతి ఎంటి
SI : తనతో వ్యాపార వ్యవహారాలు పెద్దగా మాట్లాడేవాడు కాదు అంట. పైగా వ్యాపార సమావేశాలు ఫాంహౌస్ మరియు ఆఫీస్ లో నిర్వహించే వాళ్ళు కాబట్టి తనకి ఎవరు తెలీదు అంట అలాగే ఎవరి మీద అనుమానం లేదు అని అంటుంది. సార్ నేను చుట్టుపక్కల కెమెరాలు కూడా చూసాను ఏమి లాభం లేదు . రాత్రి సమయం అవ్వడం వల్ల నంబర్ కనపడలేదు మొత్తం పూర్తిగా నల్లబట్టలు వేసుకున్నది సారి సార్ వేసుకున్నాడు
DSP : ఎందుకు అమ్మాయి కాకూడదు రంజిత్ . ఒక పని చేయండి
భూషణ్ కాల్ లిస్ట్ తెప్పించండి
SI : సార్ నేను అది కూడా చూసాను ఎలాంటి తేడా లేదు
రాజేష్ : చెప్పండి ప్రవీణ్ గారు
ప్రవీణ్ : సార్ హంతకుడి వేలు ముద్రలు దొరికాయి , హత్య చేశాక వాటర్ తాగాడం వల్ల దొరికిపోయాడు
రాజేష్ : ఓహ్ ! అలాగా ఇది మనకి కేస్ పరిష్కారానికి ఉపయోగ పడుతుంది
DSP : అస్సలు మొదటి హత్య వెనుక ఉన్న కారణం ఎంటి అన్నది తెలియడం లేదు . నాకు రెండు రోజుల్లో హంతకుడి గురించి తెలియాలి . ఏదైనా మరిచిపోయారేమో మల్లి మొదటి నుండి ఇన్వెస్టిగేషన్ చేయండి . మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించండి
--------------------------
2 రోజుల తర్వాత
-------------------------
SI : సార్ భూషణ్ గారిని చంపిన వ్యక్తి దొరికాడు సార్
DSP : ఎక్కడ ఉన్నాడు
SI : ఇప్పుడే సబ్ జైల్ కి వెళ్ళాడు , రేపు కోర్టు కి తీసుకొస్తున్నారు
DSP : మోటివ్ ఎంటో తెలిసిందా
SI : తెలిసింది సార్ .
DSP : ఎంటి అది
SI : ----------
----------------------------
2 వారాల తరువాత
---------------------------
హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథం : ఎది ఏమైనా భలే పట్టుకున్నారు సార్ హంతకులను . మొత్తానికి సాధించారు
రంజిత్ : చేసిన వాడు దొరికాడు , చేయించిన వాడే ఇంకా దొరకలేదు
విశ్వనాథం : మీరేం అంటున్నారు సార్
రంజిత్ : అవును సార్ ! ఈ కేస్ లోకం దృష్టి లో అయిపోయింది
కానీ నా దృష్టి లో ఇంకా తేలలేదు
విశ్వనాథం : మరి అసలు హంతకుడు ఎవరు సార్
సశేషం
