Tvs Ramakrishna Acharyulu

Horror

4.7  

Tvs Ramakrishna Acharyulu

Horror

దెయ్యం

దెయ్యం

2 mins
3.2K


అది ఒక పల్లెటూరు. సాయంత్రం ఐతేచాలు ఊరి రచ్చబండ దగ్ఖర కుర్రకారు, పెద్దవాళ్ళు చేరతారు.పెద్దవాళ్ళు రాజకీయాలు కుర్రాళ్ళు సినిమాలు ఇవి వారి చర్చలో భాగం.కుర్రాళ్ళు ఏ రాత్రో ఇంటికి చేరతారు,దానికి ముందు ఏదో ఒక విషయం మీద ఛాలెంజ్ లు ఉంటాయి

ప్రతి రోజులాగే ఆరోజూ సాయంత్రం నలుగురు యువకులు ఒకచోట చేరారు వాళ్ళ చర్చ దెయ్యాలు గురించి.

'ఒరేయ్ ఎన్నైనా చెప్పండి దయ్యాలంటే నాకు నమ్మకం లేదు 'అన్నాడు కిషొర్

"ఒరేయ్ నీకు పుణ్యం ఉంటుంది దెయ్యాలు గురించి అలా మాట్లాడకురా అవి పగపడ్తాయట మాబామ్మ చెప్పింది"అన్నాడు సుభాష్

"దయ్యాలు పగబట్టడమేంటిరా?అసలు మన ఊళ్ళో దెయ్యం ఏంటి ?నాన్సెన్స్ "అన్నాడు కిషొర్

"నిజమేరా మనవాళ్ళు చాలామంది చూసారట.దాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ అంతు చూస్తుందట!నువ్వు జాగర్త రా కిషోర్"భయంగా అన్నాడు రమేష్

"సరే సరే వెళ్ళండి,నాకేమీకాదు నాజోలికి వస్తే దాని అంతు చూస్తాను"అంటూ ఇంటి వైపు వెళ్ళాడు కిషోర్

కిషొర్ పాతికేళ్ళ చదువుకున్న యువకుడు.ధైర్యం ఎక్కువ.ఇంటికి వస్తూనే "అమ్మా భోజనం పెట్టు "అంటూ ఆ దెయ్యం గురించే ఆలోచిస్తూ అన్యమనస్కంగా తల్లిపెట్టీన భోజనం చేసాడు.మేడమీద తన గదిలోకివెళ్ళి తలుపులు వేసి పడుకున్నాడు.

రాత్రి హఠాత్తుగా మెళుకువ వచ్చింది కిషోర్ కి.వేసిన తలుపు తీసిఉంది ."తను తలుపు వేసేకదా పడుకున్నాడు మరి ఇది ఎలా "అనుకుంటూ లేచి తలుపు వేయడానికి వెళ్ళాడు. ఎక్కడినుండో మంచి పరిమళం వస్తూ ఉంది."ఏంటి ఈ పరిమళం ఎప్పుడూ అనుభవం లో లేదు "అనుకుంటూ తలుపువేయబోయాడు.ఇంతలో గుమ్మందగ్గర ఎవరో నిలబడినట్టుగా అనిపించి బయటకు వచ్చాడు కిషోర్. ఇరవై యేళ్ళుంటాయేమో ,గాలికి ఎగురుతున్న ఒత్తైన పొడవైన తలవెంట్రుకలు,పల్చగా శరీరాన్ని చుట్టుకున్న లైట్ పింక్ కలర్ చీర ,జీరాడుతున్న పైట,సన్నగా నాజూగ్గా ఉంది అమ్మాయి."ఎవరై ఉంటారబ్బా"!అనుకుంటూ "హలో ఎవరు "?అన్నాడు.

"నేను తెలియదా!సాయంత్రం నా గురించి చాలా ఎక్కువగా మాట్లాడావు కదా "చాలా మత్తుగా సున్నితంగా ఉంది గొంతు

"ఓయ్!ఇలాంటి వేషాలు నా దగ్గర వెయ్యద్దు.ఎవరు నువ్వు?

"నేనెవరో చూస్తావా...చూస్తావా...చూడు ..చూడు...చూడరా...అంటూ ఒక్కసారి వెనక్కు తిరిగింది ఆ ఆకారం.

ఒక్కసారి తుళ్ళిపడ్డాడు కిషోర్. భయంతో చెమటలు పడుతున్నాయి.ఆ ఆకారం ముఖం నిండా రక్తం.కళ్ళు బయటకి ఉబ్బి రక్తంలోతేలుతున్నట్లున్నాయి.

ఒక్క అడుగు వెనక్కి వేసాడు కిషొర్.రెండడుగులు ముందుకు వేసింది ఆ ఆకారం."దయ్యాలు లేవా?చూసావా?ఉన్నాయా?చెప్పు ....చెప్పరా..అంటూ మీదమీదకి వచ్చింది.

"ఆగు ఆగు నన్న్....నన్నేమీ ...చేయకు..నూతిలోంచి వచ్చినట్లుంది మాట

"ఏంటి నా ధైర్యం ఏమయ్యింది" కిషోర్ ఆలోచనల్ని భంగపరుస్తూ..రేయ్ అంటూ కిషోర్ పీక పట్టుకుంది.బరబరా ఈడ్చుకుంటూ మేడ మీదనుండి కిందకు లాక్కుపోయింది.మెడమీద నుండి సన్నగా రక్తం కారుతున్నట్టు తెలుస్తోఃది.ఊపిరి ఆడటంలేదు.అరవలేక పోతున్నాడు.హాలులో లైట్లు ఆర్పి ఉన్నాయి.అలా లాక్కుంటూ బయటికి తీసుకు వెళ్ళిపోయింది. అంతా నిర్మానుష్యంగా ఉంది .కుక్కలు మాత్రం భయంకరంగా మొరుగుతున్నాయి.ఇంక తన పనైపోయింది.ఆశ ఒదిలేసుకున్నాడు కిషోర్.అలా అలా ఊరి రచ్చబండ దగ్గరకి లాక్కొచ్చింది కాళ్ళు ఈడ్చుకు పోతున్నాయి రక్తం కారుతోంది.

రచ్చబండ దగ్గరకి వచ్చేసరికి రమేష్ ,సుభాష్ అచేతనంగా పడి ఉన్నారు. ఆ ఆకారం రచ్చబండ మీద కూర్చుంటూనే కిషోర్ ని అమాంతంఎత్తి ఒళ్ళో వేసుకుంది.ఒక్కసారిగా ముఖం వికృతంగా చేస్తూ నోరు పెద్దగా తెరిచి వాడి పళ్ళతో గోళ్ళతో కిషోర్ గొంతు కొరికేస్తోంది.ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండును కానీ ఎవరు వస్తారు.గట్టిగా అరవడానికి కూడా అవకాశం లేదు.అయినా బలవంతంగా కాపాడండి....కాపాడండి...అంటూ బిగ్గరగా అరిచే ప్రయత్నం చేసాడు.కాళ్ళు బలంగా కొట్టుకుంటున్నాడు.ఆ ఆకారం ఇంకా వికృతంగా మా‌రుతోంది

కాపాడండీ..కాపాడండీ...ఆ అరుపులకి పక్క రూములో ఉన్న తల్లి తండ్రి వచ్చి తలుపులు దబా దబా బాదారు ఆ శబ్దానికి మెళుకువ వచ్చి తుళ్ళిపడి లేచాడు కిషోర్.ఏంటి ఇదంతా కలా...!ఆశ్చర్యపోతూ లేచి తలుపుతీసాడు కిషోర్


Rate this content
Log in

Similar telugu story from Horror