Tvs Ramakrishna Acharyulu

Drama

4  

Tvs Ramakrishna Acharyulu

Drama

ప్రేమంటే

ప్రేమంటే

2 mins
535




ప్రశాంతతకి,ప్రకృతి అందాలకిపల్లెటూళ్ళే పట్టుకొమ్మలు.అలాంటి ఓ పల్లెటూరు.పల్లె ఎప్పుడో నిద్ర లేచింది.సూర్యుడి నునులేత కిరణాలతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ నిద్రలేచాడు సురేంద్ర.ఎంత ఆలస్యంగా పడుకున్నా సూర్యోదయానికి లేవడం అలవాటు.లేస్తూనే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళ పొలం వైపు వెళ్ళడం అలవాటు.దారిలో పెద్దవాళ్ళని మర్యాదపూర్వకంగా పలకరిస్తూతనని పలకరించిన వాళ్ళని పలకరిస్తూ వెళ్తున్నాడు.

తనకిఉన్న నాల్గు ఎకరాల పొలంలో కొన్ని కొబ్బరిచెట్లు,మామిడి చెట్లు పెంచుతున్నాడు.రకరకాల కూరగాయలు కూడా పండిస్తున్నాడు. పొలంలోకి వెళ్లి స్వయంగా ప్రతి మొక్కని పలకరిస్తున్నట్టుగా తిరుగుతాడు.ఒక గంట అక్కడ శారీరిక శ్రమ చేసి మరలా ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ గా డ్రెస్ చేసుకొని గ్రామంలో ఉండే లైబ్రేరీకి వచ్చి కాసేపు పత్రికలు తిరగేస్తాడు.అక్కడే ఓ గంట గడిపి మళ్ళా పొలం వైపు వెళ్తాడు.

అలా వెళ్తుంటే ఆరోజు ఒక కాలేజీ బస్ వచ్చి ఆగింది.అందులోంచి బిల బిల లాడుతూ ఓ ఇరవై మంది అమ్మాయిలూ అబ్బాయిలూ దిగారు.దిగుతూనే సురేంద్ర ని చూసి ఒక అబ్బాయి చొరవగా " సర్ మేము వి.వి.ఎం. కాలేజ్ నుండి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాం.ఈ ఊరు సర్పంచ్ గారిని కలవాలి.మీరేమైనా సాయం చేయగలరా"- అన్నాడు. "సరే రండి సర్పంచిగారింటికి వెళ్దాం "అని బయలు దేరాడు

"రాధికా ఉండవే! నా లగేజ్ ఇంకా బస్ లోనే ఉంది. బస్ మళ్ళీ వెళ్లి పొతుందిగా ! ఒక్క నిముషం ఆగవే !" అంటూ ఒక అమ్మాయి అరిచింది."ఉన్నానే బాబూ ! మనం వచ్చింది పట్నానికి కాదు పల్లెటూరికి.బెంగ పడకు నెమ్మదిగా వెళ్ళచ్చు త్వరగా దింపుకో లగేజ్" అంది రాధిక

టీనేజ్ లో ఉన్న ఆపిల్లల్ని చూస్తుంటే స్వేచ్చగా ఎగిరే సీతాకోక చిలుకలని చూసినంత ఆహ్లాదంగా ఉంది.ఇందాకా పలకరించిన అబ్బాయితో "అవును ఇంతకీ నీ పేరు చెప్పలేదు ?అన్నాడు సురేంద్ర .

సారీ సార్ !నా పేరు విజయ్ .మేమంతా ఇక్కడ అగ్రికల్చర్ సైన్స్ సంబంధించి ఫీల్డ్ వర్క్ మీద వచ్చాము. మా ప్రిన్సిపాల్ గారికి మీ సర్పంచ్ గారు బాగా తెలుసట అందుకే లెటర్ ఇచ్చి పంపారు.ఇంతకీ మీ పేరు సర్ ... అన్నాడు ఆ అబ్బాయి.

ఓ.కే. విజయ్ నా పేరు సురేంద్ర.అదుగో సర్పంచ్ గారి ఇంటికి వచ్చేసాం.అంటూ మావయ్యా ..మావయ్యా అని గట్టిగా పిలిచాడు సురేంద్ర

"ఏరా ! ఏమిటి ఇలా దారితప్పి వచ్చావు? ఈ టైములో పొలంలో కదా ఉంటావు?"అంటూ ఓ 50 ఏళ్ల ఆసామి బయటికి వచ్చాడు.సాదాసీదాగా పంచెకట్టు కట్టుకొని బుర్ర మీసాలు సవరించుకొంటూ వస్తున్న ఆయన్ను చూసి అందరూ నమస్తే సార్ అన్నారు.

"ఓహో ఆదా సంగతి ఈ పిల్లకాయలు నీకు తగిలారు కాబట్టి ఇలా వచ్చావన్నమాట.అంతా బాగున్నారా బాబూ! మా రాజశేఖరం చెప్పాడు పిల్లకాయల్ని పంపుతున్నానని.మీరే అన్నమాట.సరే మీరిక్కడ ఉన్నన్నాళ్ళు మీ సొంత ఇల్లే అనుకుని ఉండండి.దేనికీ లోటు లేదు ఆడ పిల్లలు అదుగో ఆ కుడిపక్కనున్న ఇల్లు వాడుకోండి .మీకు సౌకర్యంగా ఉంటుంది.మగ పిల్లలు పక్కనే పంచాయతీ ఆఫీసు ఉంది అందులో నాల్గు గదులున్డాయి.అందులో సర్దుకోండి.ఇక కాఫీలు టిఫిన్లు అన్ని ఇక్కడికే వచ్చి చెయ్యల.స్నానాలకి అక్కడే ఏర్పాట్లున్నాయి.మరి ముందుగా కాస్త కాఫీలు పుచ్చుకొని అప్పుడు మీ గదుల్లోకి చేరండి" అని చెప్పి

"ఒరే పేరిగా ఈల్లందరికీ కాఫీలు తెచ్చి ఇయ్యరా ..అని" చెప్పు సురేంద్రా ఇంకేటి విశేషాలు రా అలా పొలానికి వెళ్తూ మాటాడుకుందాం"అని బయలు దేర దీసాడు.అందరూ థాంక్ యు సర్ అని సురేంద్ర కీ సర్పంచ్ గారికీ ఎంతో ఆనందంగా నమస్కరించారు.మీరు రెడీ అవండి మేము అలా వెళ్లి వస్తాము.అన్నారు సర్పంచ్ గారు (సశేషం )




Rate this content
Log in

Similar telugu story from Drama