Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Tvs Ramakrishna Acharyulu

Drama

4  

Tvs Ramakrishna Acharyulu

Drama

ప్రేమంటే " కథ 2 వ భాగం

ప్రేమంటే " కథ 2 వ భాగం

1 min
468



సురేంద్ర ఆ వూరిలో చదువుకున్న వాడు ,బుద్ధిమంతుడు. ఈ కాలం కుర్రాళ్ళల్లా అల్లరి చిల్లరగా తిరిగే రకం కాదు.ఎప్పుడూ పని, లేదంటే ఏవో పుస్తకాలు తిరగేస్తుంటాడు.

సురేంద్ర కి చిన్నతనంలోనే తల్లితండ్రి చనిపోతే మేనమామ రంగారావు(సర్పంచ్ ) పెంచి పెద్ద చేసాడు.చక్కగా చదువుకున్నాడు.ఏదైనా ఉద్యోగం చెయ్యమంటే లేదు నేను ఈ పల్లెటూరిలోనే ఉండి వ్యవసాయం చేసుకుంటానన్నాడు.

చదువు పూర్తయ్యాక తన యింట్లో తనే ఉంటూ చేతనైనట్లు వొండుకు తింటుంటాడు.అత్త ఎంత చెప్పినా "ఇన్నాళ్ళూ నిన్ను శ్రమ పెట్టాను కదా అత్తా,నేనేమన్నా చిన్న పిల్లాడినా ,ఏదైనా అవసరమైతే అడుగుతానులే అంటాడు.పోనీలే నాయనా ! చక్కని పిల్లని చూసి పెళ్లన్నాచేసుకో అంటుంది. ఆవిడ మనసులో భావం వేరు. ఎదిగిన కూతురుంది.ఇంతకన్నా బుద్దిమంతుడిని తేలేము.ఉన్నది ఒక్కగా నొక్క కూతురే.ఇంకా సురేంద్ర మనస్సులో ఏముందో తెలియదు.మేనమామ కూతురు అపర్ణ అంటే మంచి అభిమానం.మేనమామకి చేదోడు వాదోడుగా ఉంటూ ఊరందరికీ తలలో నాల్కలా ఉంటాడు సురేంద్ర.


బయటకి వెళ్ళాక చెప్పారు సర్పంచ్ రంగారావు గారు ఈ పిల్లలకి ఇక్కడ వ్యవసాయ సంబంధమైన కొన్ని విషయాలని తెలుసుకోవడానికి తన మిత్రుడి కాలేజీ నుండి ఇక్కడికి పంపారని, కొద్ది సేపట్లో వాళ్ళ గైడ్ లెక్చరర్ కూడా వస్తారని.వాళ్లకి సహాయంగా నువ్వుకూడా ఉండాలని."సరే" అన్నాడు సురేంద్ర.

మరోగంటకి వాళ్ళు ఇంటికి చేరేసరికి కాలేజ్ పిల్లలంతా చక్కగా తయారయ్యారు.అప్పటికే ఆలస్యమయ్యిందేమో ఆవురావురుమని టిఫిన్లు లాగించేస్తున్నారు.అందరికీ ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తున్నారు పనివాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తల్లీకూతుళ్ళు అపర్ణ,భానుమతి గారు.

 ఇంతలో కాలేజ్ లెక్చరర్ నరసింహంగారు కూడా వచ్చారు.అప్పుడు అంతాకలిసి అక్కడ వాళ్ళు చెయ్యబోయే వారం రోజుల కార్యక్రమం గురించి చర్చించు కున్నారు. సురేంద్ర సహకారాన్ని కూడా కోరారు.ఎలాగూ ఈ పూటకి ఆలస్యమయ్యింది కాబట్టి మద్యాహ్నం మూడుగంటల కల్లా అందరూ ఫీల్డ్ కి వెళ్లాలని నిర్ణయించారు....(సశేషం)



Rate this content
Log in

More telugu story from Tvs Ramakrishna Acharyulu

Similar telugu story from Drama