భవిత
భవిత


రామమూర్తి వయసు 70దాటింది.ఆరోగ్యంగానే ఉన్నాడు.ఆయనకి ఒక్కడే కొడుకు.బాగా చదివించాడు.బెంగళూరులో సాప్ట్ వేర్ జాబ్.పేరు సుబిక్షం.తనకు తండ్రి పెట్టిన పేరు ఒక్కోసారి ఇబ్బంది అనిపించినా చాలా ఇష్టం.
రామమూర్తి పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు.నాలుగు ఎకరాలలోనే తన కుటుంబ అవసరాలకి పనికివచ్చే కూరగాయలు పప్పుదినుసులు వరి పండిస్తాడు.ఇంటి పెరట్లో పండ్లమొక్కలు కొబ్బరి చెట్లు పూలమొక్కలు ఉంటాయి.
కొడుక్కి పెళ్ళిచేసాడు ఇద్దరు పిల్లలు పెద్దది పావని ఇంటర్ చదువుతోంది చిన్నవాడు రఘు టెన్త్ చదువుతున్నాడు.సెలవులకి తాతగారి ఊరు వస్తుంటారు.వస్తే తాతగారి తో కలసి పెరటి తోటలో పొలంలో తిరుగుతారు.వాళ్ళకి అది బాగా ఇష్టం.
సంక్రాంతి సెలవలకు ముందుగా పిల్లల్ని పంపించాడు సుబిక్షం. ఒకరోజు అలా పొలంవెళ్ళిన పిల్లలకి "చూడండి పిల్లలూ.ఇది నేల తల్లి.దీనిని నమ్ముకున్నవాళ్ళకు ఎప్పటికీలోటుండదు. అలాగే ఈ పచ్చని మొక్కలు మన సహజసంపద.ఈ చెట్లు చేమల్ని మనమెంతగా ప్రేమిస్తే అవి మనిని అంతగా కాపాడుతాయి. మనమిచ్చే గుక్కెడు నీళ్ళు తాగి మనకు బ్రతికేందుకు ఊపిరినిస్తాయి.అలాగే మన పెరటిలో ఉన్న ప్రతిమొక్క చెట్టు మనకు ఆనందాన్ని ఇస్తాయి.నాకు అవంటే ప్రాణం.మీరుకూడా వాటిని నాలాగే ప్రేమగా చూసుకుంటారా?అన్నాడు.
" ఓ తాతయ్యా!నీవలన మాకు కూడా అవంటే ప్రేమ ఏర్పడింది.మేము వచ్చినప్పుడల్లా వాటిని చూసుకుంటాం"అన్నారు ఇద్దరూ ఒక్కసారే.
"వీటి బాధ్యత నీకే అప్పచెపుతున్నారా రఘూ!నా తర్వాత వీటిని నువ్వే చూసుకోవాలి.చూసుకుంటావుకదూ!"అంటూ రఘుచేతిని చేతిలోకి తీసుకున్నాడు.
పండగకి సుబిక్షం భార్య వచ్చారు.అందరూ చాలా సరదాగా రెండు రోజులు గడిపేసారు.తెల్లవారితే ప్రయాణం.
"తాతయ్యా మేం వెళ్తున్నాం."అంటూ రామమూర్తి గదిలోకి వెళ్ళిన రఘు తాతయ్య ను చూసి ఖంగారు పడ్డాడు.గట్టిగా అరిచాడు. అందరూ వచ్చారు.రామమూర్తి ఈ లోకం వదలి వెళ్ళాడని తెలిసింది.
తాతయ్య మాటలు జ్ఞాపకం చేసుకుంటూ తన భవిత నిర్ణయించుకున్నాడు రఘు