Tvs Ramakrishna Acharyulu

Drama

4.5  

Tvs Ramakrishna Acharyulu

Drama

కిడ్నాప్

కిడ్నాప్

2 mins
412


ఆఫీస్ పనిలో ఉన్న శంకర్ పదేపదే ఫోన్ రింగవ్వడంతో విసుగ్గా ఫోన్ తీసి "ఆ ఏంటి చెప్పు"అన్నాడు.అవతల భార్య చెప్పిన విషయం విని కాస్త ఖంగారు పడ్డా తమాయించుకొని "ఒకసారి ఇల్లంతా వెతికావా?అన్నిగదులు సరిగా చూడు.బాల్కనీలో కూడా చూడు.క్రింద ఇంటివాళ్ళని అడిగావా "అంటూ గబగబా ఫైళ్ళన్నీ సర్దేసి మేనేజర్ రూమ్ వైపు పరుగు పెట్టాడు.ఇంకా భార్య కి ధైర్యం చెబుతూ సలహాలు ఇస్తున్నాడు.మేనేజర్ రూమ్ కి వెళ్తూనే"సర్ అర్జెంటు గా పర్మిషన్ కావాలి. వీలవ్వకపోతే హాఫ్ డే సి.ఎల్.వేయండి"హడావిడి పడుతున్న శంకర్ ని చూస్తూ"కూల్ కూల్ అసలు విషయం ఏమిటి. ఖంగారు పడకుండా చెప్పు శంకర్" అన్నాడు మేనేజర్.

"అదిసర్ మాఅబ్బాయి కనపడటం లేదట.మా శ్రీ మతి ఫోన్ చేసింది.

"మూడేళ్ళ పిల్లాడు. ఎక్కడికి పోతాడయ్యా!కాస్త ఖంగారు పడకుండా వెతకమనలేకపోయావా?అన్న మేనేజర్ మాటలకి కాస్తంత విసుగుతో"అన్నీ అయ్యాయి సర్ నేను వెళ్ళాలి.ప్లీజ్ అంటూ సమాధానం కోసం కూడా చూడకుండా బయలుదేరి పోయాడు.సరే ఏవిషయం నాకు ఫోన్ చెయ్యి అంటూ తనపని లో నిమగ్నమయ్యాడు మేనేజర్.

హడావుడిగా ఇంటికిచేరాడు శంకర్.ఇంటినిండా అప్పటికే ఇరుగుపొరుగు చేరి పరిమళని ఓదారుస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు కొందరు."చంటిపిల్లల్ని ఓకంట కనిపెట్టి చూసుకోవాలి వదినా"ఒక ఇల్లాలి సలహా.

అందుకే నేను ఒక పనిమనిషి ని పెట్టేసుకున్నాను.డబ్బుకోసం చూసుకోకూడదు.ఓగర్విష్ఠి సూచన.

భర్తని చూస్తూనే బావురుమంది పరిమళ.

దగ్గరకితీసుకుని ఓదారుస్తూ"అసలు నువ్వెప్పుడు చూసుకున్నావు"అని అడిగాడు శంకర్.

వాడికి అన్నం పెట్టి ఆడుకోడానికి బొమ్మలు ఇచ్చాను.అప్పటికి 12అయ్యింది.నేనూ భోజనం చేద్దామనుకుంటుండగా ఇస్త్రీఅతను వచ్చాడు.బట్టలు తీసుకొని డబ్బులిచ్చి లోపటికి వెళ్ళి బట్టలు సద్ది అన్నం తిని వచ్చేసరికి వాడులేడు.


ఇస్త్రీ అబ్బాయి వెంటనే వెళ్ళిపోయాడా?శంకర్ ప్రశ్నకి లేదండీ పిల్లాడితోఆడాడు చాలాసేపు.పరిమళ సమాధానం 

తర్వాత ఇంకెవరైనా వచ్చారా.

లేదండీ అన్నంతిని గిన్నెలు శుభ్రం చేసివచ్చేప్పటికి ఒక గంటపైనే పట్టింది.


ఇంతలో విషయం తెలుసుకుని శంకర్ ఫ్రెండ్ ఎస్.ఐ.రవీంద్ర వచ్చాడు.పిల్లాడి ఒంటిమీద బంగారం ఏమైనాఉందామ్మా అడిగాడు. పరిమళని.అవునండీ ఒక తులం చైన్ ఉందండి.

ప్రస్తుతానికి కంప్లైంట్ ఇవ్వకండి.ఆ ఇస్త్రీ అబ్బాయి ఇల్లు చూపించండి నేను కనుక్కుంటాను అన్నాడు రవీంద్ర.

రవీంద్ర వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం పెట్టి ఉంది.చుట్టుపక్కల అడిగితే ఓ గంట క్రితం హడావుడి గా వెళ్ళడం చూసామని చెప్పారు.అప్పటికే మధ్యాహ్నం3దాటింది.

శంకర్ ఇంటికి తిరిగి వచ్చాడు రవీంద్ర. భోరున ఏడుస్తోంది పరిమళ.ఏంచేయాలో పాలుపోక దుఃఖాన్ని పంటిబిగువున ఆపుకుంటున్నాడుశంకర్.

ఇరుగుపొరుగుల మాటలతో మరింత భయం వేస్తోంది.ఇల్లుదాటి వెళ్ళేవయసుకాదు పిల్లాడిది.

మెళ్ళో బంగారం కోసం ఏదైనా ఘాతుకం చేస్తాడా ఆ ఇస్త్రీ వాడు.పరిపరివిధాల ఆలోచిస్తున్న శంకర్ తో ఇంక కంప్లైంట్ ఇయ్యి శంకర్.నేను చూస్తాను.అన్నాడురవీంద్ర.

ఇంతలో మమ్మీ...అంటూ బాబు పిలుపు వినబడి ఆ వైపు ఉలిక్కిపడి చూసారు అందరూ.

సోఫాక్రింద నుండి పాకుతూ వస్తున్న బాబు ని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి అందరికీ. ఆడుకుని ఆడుకుని సోఫా క్రింద కి పోయి నిద్ర పోయినట్టున్నాడు.ఇంతమంది జనాల్ని చూసి బిత్తరపోయి తల్లిని గట్టిగా వాటేసుకుని ఏడవడం మొదలు పెట్టాడు.



Rate this content
Log in

Similar telugu story from Drama