Tvs Ramakrishna Acharyulu

Drama

4.4  

Tvs Ramakrishna Acharyulu

Drama

నేనున్నానని

నేనున్నానని

2 mins
291


సాయంకాలం సముద్రపు ఒడ్డున కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆలోచిస్తున్నాడు రామకృష్ణ.అస్తమించే సూర్యుడిని చూడడానికి ఎంతబాగుంటుంది!కానీ అలా సముద్రగర్భంలోకి జారిపోతున్న సూర్యుడుని చూస్తే మాత్రం తన కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటన కళ్ళముందు కదులుతూ ఉంటుంది రామకృష్ణ కి.

ఆరోజు వనభోజనాలకని సముద్రపు ఒడ్డున ఉన్న సరుగుడు తోటలో విడిదిచేసారు 50 మంది కాలేజీ విద్యార్థులు.అమ్మాయిలు అబ్బాయిలు చాలా హుషారుగా ఉన్నారు.ఫుడ్ ఆర్డర్ చేసారు కాబట్టి టైమ్ కి వస్తుంది.రావడమే రకరకాల ఆటలు మొదలు పెట్టారు.

రామకృష్ణ రాజేష్ గణేష్ రంగ నలుగురు మంచి స్నేహితులు.రామకృష్ణ అందరిలోకి వయసులో కాస్త పెద్ద ,పెళ్ళయినవాడు అందుకే అందరూ అతన్ని గౌరవంగా చూస్తారు.

"ఒరేయ్ ఈరోజు బాగా ఎంజాయ్ చెయ్యాలిరా"అన్నాడు రంగ

"మనం వచ్చిందే అందుకు కదరా "అన్నాడు రాజేష్

"నేనన్నది అదుగో ఆ పెద్దాయన కూడా ఎంజాయ్ చెయ్యాలని"అన్న రంగ మాటలకి 'నీ ఆటలేవో నువ్వాడుకోవయ్యా!నన్నెందుకు లాగుతావు"అన్నాడు రామకృష్ణ

"చెప్పానా ముప్పయ్యేళ్ళకే ముసలాడిలా ఫీలయిపోతాడు ఈయన"రంగ రెచ్చగొడుతూ అన్నాడు.

"ఆయన్నెందుకురా ఇబ్బంది పెడతావు,అయినా ఆయనా ఈవేళ మనతో ఆడతారులే"అన్నాడు గణేష్.

"అయితే రమ్మను సైకిల్ రేస్ పెట్టుకుందాం"అన్నాడు రంగ

"ఇక్కడా ఇసకలోనా"ఇంకా రామకృష్ణ మాటపూర్తికాకుండానే "చూసావా ఇలాగే వంక‌లు పెడతాడీయన.ఇసకలోఐతేనే మజా"అంటూ కూర్చున్నవాడిని జబ్బపట్టి లేపుతూ ",రావయ్యా బాబూ "అన్నాడు.

"సరే ఈవాళ నీఇష్టం నువ్వెలా ఉండమంటే అలా ఉంటా సరేనా,నడు"అని ఫ్యాంటుకి అంటిన ఇసక దులుపు కుంటూ లేచాడు రామకృష్ణ

అంతే!అందరూ ఉత్సాహంగా స్లో సైక్లింగ్ రన్నింగ్ ఇలా రకరకాల ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు.ట్రైనింగ్ కా‌లేజి కావడంవల్ల అమ్మాయిలు ఎక్కువ మందే ఉంటారు అబ్బాయిలు 15మందే.

వీళ్ళు ఆడుతూఉంటే రెండుకళ్ళుమాత్రం రంగ నే నిశితంగా పరిశీలిస్తున్నాయి.అతడు గెలుస్తుంటే ఆ కళ్ళు మెరుస్తున్నాయి. అది గమనించాడు రంగ

ఇంకా రెచ్చిపోయి ఆడుతున్నాడు.

బాగా అలసిపోయారు మధ్యాహ్నం కావస్తోంది ఆకలి నకనకలాడిస్తోంది అందరినీ.ఇంతలో ఆర్డరిచ్చిన భోజనాలు వచ్చాయి. చక్కగా అందరూ సెర్వ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆటపట్టించుకుంటూ భోజనాలు ముగించారు.

ఆ ప్రేమ కళ్ళు రంగ కి మరింత దగ్గరవుతున్నాయి.

విశ్రాంతి తీసుకుంటున్నారు అందరూ.రంగ ఎక్కడినుంచి తెచ్చాడో రెండులీటర్ల ధమ్సప్ బాటిల్ తెచ్చాడు బాగా కూల్ గా ఉంది."ఇది దింపకుండా తాగేస్తాను ఎవరైనా పందెంకడతారా "అన్నాడు రంగా


"ఒరేయ్!ఇప్పుడేకదరా పీకలదాకా తిన్నావ్ అదెలాతాగుతావురా అన్నాడు గణేష్

" అంందుకేకదా పందెం "అన్నాడు రంగ

అందరూ వద్దన్నపనిచేయడంలోనే రంగకి కిక్కుంటుంది.మొత్తం మీద అంత ఛిల్డ్ గా ఉన్న డ్రింక్ అందులోనూ థమ్సప్ దించకుండాతాగేసాడు.

కొంతసేపటితర్వాత అందరూ బీచ్ వైపు కదిలారు

రామకృష్ణకి సముద్రం అంటే భయం.కానీ మిగిలిన వాళ్ళంతా లాక్కెళ్ళిపోయారు.అందరూ ఆడుకుంటున్నారు.ఈతవచ్చిన ఇద్దరుముగ్గురు ఈతకొడుతున్నారు.అందులో రంగ కూడా ఉన్నాడు.అందరికన్నా ముందుకి వెళ్తున్నాడు.

చాల్లేరా ఇంక వెనక్కిపోదాం అంటూ మిగిలిన ఇద్దరూ వెనక్కివచ్చేసారు.

అందరూ ఎవరి ఆటల్లో వాళ్ళు ఉన్నారు.కాసేపటికి గణేష్...గణేష్....అంటూ అరపు వినపడింది.ముందు ఎవరూ పట్టించుకోలేదు. మళ్ళీ వినపడేటప్పడికి గణేష్ చూసాడు.నీళ్ళలో ములుగుతూ రంగ కనపడ్డాడు."చాల్లేరా నీ యాక్షన్ రా బయటికీ "అన్నాడుగణేష్.

ఇంతలో రామకృష్ణ అటువైపుచూసాడు.రేయ్ వాడు నిజంగానే ములిగిపోతున్నాడు "అంటూ గట్టిగా అరిచాడు.

అంతే అందరూ ఎలర్టయ్యారు.బాగా ఈతవచ్చిన ముగ్గురూ ఈదుకుంటూ వెళ్ళారు.గణేష్ రంగ జుట్టు అందిపుచ్చుకున్నాడు.

మిగిలిన ఇద్దరు ఒకళ్ళచేతులు మరొకళ్ళచేతులకు గొలుసులా చేసి పట్టుకున్నారు. ఇంతలో మిగతావాళ్ళు కూడా వెళ్ళి ఒకరకి ఒకరు చేతులు గొలుసులావేసి బలంగా నిలబడ్డారు. గణేష్ బలంగా రంగాని బయటకి లాగాడు.అందరూ అతనికి ఊతం ఇచ్చారు.మొత్తానికి రంగాని ఒడ్డుకు చేర్చారు.అప్పటికే నీళ్ళు ఎక్కువ తాగడంతో స్పృహతప్పింది రంగకి.

కాసేపు పొట్టపై గట్టిగా రాజేష్ నొక్కడంతో నెమ్మది నెమ్మదిగా నీళ్ళు కక్కడం మొదలు పెట్టాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చాడు.అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరెండకళ్ళూ వర్షిస్తూనే ఉన్నాయి.

సూర్యుడు పూర్తిగా అస్తమించాడు.అదే సముద్రంలో చంద్రోదయం అవుతుంటే ఆలోచనల్లోంచి బయటికివచ్చాడు రామకృష్ణ. ఆరెండు కళ్ళూ జీవితమంతా రంగా కి తోడునీడ అయ్యాయి.



Rate this content
Log in

Similar telugu story from Drama