STORYMIRROR

Naveen Surya

Action Crime Thriller

4  

Naveen Surya

Action Crime Thriller

బాటసారి - 2

బాటసారి - 2

3 mins
461

రాత్రి 10 గంటల తర్వాత 

--------------------------------


పూర్తిగా వాళ్ళు ( అర్జున్ ,రాజన్న ) నిద్రలోకి జారుకున్నారు అని

 నిర్ధారించుకున్నాక నేను లేచాను . వీళ్ళు మంచి వాళ్ళ కావొచ్చు , చెడ్డ వాళ్ళు కావొచ్చు కాని నిజనిజాలు తెలుసుకుని అమ్మాయి దొరికెంత వరకు నా జాగ్రత్త లో నేను ఉండటం మంచిది


మొదట జీప్ దగ్గరకి వెళ్తాను అమ్మాయి కి సంబందించిన ఆనవాళ్లు కానీ లేదంటే ఫొటోస్ కానీ దొరకవచ్చు . నా ఫోన్ దొరికితే ఇక్కడ

నుండి బయట పడవచ్చు కానీ ఛార్జింగ్ కూడా అయిపోయి ఉండొచ్చు లేదంటే దొంగిలించ బడొచ్చు అయినా సరే నేను వెతికే ప్రయత్నం చేస్తాను ఇంతకు ఎక్కడ పడిపోయింది . ఓహో ఇక్కడ ఉందా !!!  ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి ???


ఎవరు మీరు ఇక్కడ ఏమి చెస్తున్నారు అమ్మాయి స్వరం 


ఇంత అర్థ రాత్రి లో ఎవరు ఈ అమ్మాయి ఇక్కడ ఏమి చెస్తుంది

బహుశా నా భార్య కావొచ్చు


(గొంతు మార్చి)

నా పేరు కార్తిక్ అండి ఈ దారి గుంట వెళ్తుంటే నా బండి 

ఆగిపోయింది (ఎంతకైనా మంచిది నా వివరాలు తెలియక పోవడమే కరెక్ట్) 


నా పేరు పల్లవి నేను నా భర్త కోసం వచ్చి ఇక్కడ చిక్కుకున్నాను . నా భర్త జీప్ దగ్గర పడిపోయాడు . వెతుకుతూ వెళ్తుంటే అడవి లో దారి తప్పి పోయాను 


(జీప్ , భర్త , పడిపోవడం. అయితే ఈమె నా భార్య నా) 

ప ప పల్లవి  


అరవింద్ నువ్వేనా మొత్తానికి మనం కలిసాము థాంక్ గాడ్ 

నువ్వేంటి గొంతు మార్చి మాట్లాడుతున్నావ్ , పేరు తప్పు చెప్పావు


ఈ అడవి లో ఎటు నుండి ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలీదు 

ఎవరి నుండి వస్తుందో తెలీదు అందుకే అలా చెప్పాను .


చీకటి కదా ఒకరిని ఒకరు గుర్తుపట్టలేదు 


అయ్యో క్షమించండి మిమ్మల్ని మన జీప్ నీ నేను గుర్తించలేక పోయాను 


సరే , కానీ మనం ఇక్కడకి ఎందుకు వచ్చాము , ఇక్కడ ఎందుకు అగాము , ఏమి జరిగింది నాకేం గుర్తు ఉండటం లేదు నీకు గుర్తుందా 


హా ! చెప్తాను ముందు అయితే మనం ఇక్కడ నుండి బయట పడాలి 

ఈ స్థలం అంత సురక్షితం కాదు . దానికి ముందు అర్జున్ నీ కూడా మనం బయట తీసుకుని రావాలి 


అర్జున్ !!!


హా అర్జున్ మన స్నేహితుడు 


కానీ బయలు దేరినప్పుడు మనం ఇద్దరమే వచ్చాం కదా 


అవును . కానీ మనల్ని అర్జున్ వెతుక్కుంటూ వచ్చాడు . జలపాతం చూడటానికి నీవు నేను నిన్న ఉదయం 10 గంటలకు చేరుకున్నాము  తిరిగి సాయంత్రం వెళ్లి పోదాం అనెలోగా మనకి జీప్ పడై పోయింది 


మరి ఇక్కడెక్కడ జలపాతం కానీ దాని శబ్దం కానీ , ఇతర యాత్రీకులు ఎవ్వరూ లేరు కదా


అయ్యో అరవింద్ ఇక్కడ నుండి మనం మన జీప్ ఆగిపోయిన ప్రదేశానికి వెళితే అక్కడ నుండి ఎడమ వైపు కి మరో పది కిలమీటర్ల దూరం వెళ్లి కాలినడకన ఒక 2 కిలో మీటర్లు నడిస్తే మనం చేరుకుంటాము

అయినా ఇద్దరం కలిసే వచ్చాము కదా నువ్వేంటి ఇలా అడుగుతున్నావు


దూరం ఉండొచ్చు కానీ జన సంచారం లేకపోవడం ఏమిటి ??? నేను లేచిన దగ్గరి నుండి ఒక్కరూ కూడా రాలేదు కదా 


అరవింద్ నువ్వు లేచింది సాయంత్రం 4 గంటలకు ఆ సమయం లో ఈ అడవి లో ఉండటం నిషేదం అందుకే వెళ్ళిపోయారు ఇది క్రూర మృగాలు ఉండే చోటు కదా అందుకే...... సరే మనం వెళ్లిపోదాం పద

 అర్జున్ నీ తీసుకుని


ఫట్ ( అరవింద్ తల పైన ఒక రాడ్డు తో గట్టిగా దెబ్బ ) 


ఎంటి పల్లవి నువ్వు ! ఎంత కష్టపడి మనం ఇది ప్లాన్ చేశాం

నువ్వు మొత్తం చెడ గొడతావా ?? 


అర్జున్ ! నేను రావడం ఆలస్యం అయితే వెళ్లిపోయే వాడు 


అవునవును !!! నేను రావడం కూడా ఆలస్యం అయితే బండి. చెడిపోతే నేను ఎందుకు చెట్టు కింద కూర్చున్నాను అని కూడా అడిగేవాడు నువ్వు జరిగింది కాస్త చెప్పేసే దానిని అప్పుడు మన ప్లాన్ మొత్తం బెడిసి కొట్టేది 


సరే సాయం పట్టు అరవింద్ నీ తీసుకెళ్దాం 


-----------

రాజన్న వస్తాడు

------------


అర్జున్ : రాజన్న కొంచెం అయితే అరవింద్ ఇక్కడ నుండి వెళ్ళేవాడు 


 పల్లవి : లేదు ! లేదు నేను కనపడకుండా ఎలా వెళ్తాడు . నేను లేకుండా ఇక్కడి నుండి అరవింద్ వెళ్ళడు 


రాజన్న : అర్జున్ గనక రాకుండా ఉండి ఉంటే కచ్చితంగా అరవింద్ నిన్ను ఇక్కడ నుండి తీసుకుని బయటపడే వాడు అప్పుడు మనం అనుకున్నది సాధ్యం కాదు 


పల్లవి : అలా ఎప్పటికీ జరగనివ్వను . అందుకే అర్జున్ నీ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పాను కానీ ...


అరవింద్ : కానీ .... చెప్పు .... ఏమి చేసే దానివి 


పల్లవి : అరవింద్ 


అరవింద్ : ఊహించలేదు కదా ...... ఊహించలేవు 

నేను మీ అదుపులో ఉన్నాను అనుకుంటున్నారు

కానీ మీరే నా అదుపు లో ఉన్నారు 


నేను పొరపాటుగా ఇక్కడకి చేరుకోలేదు .... మిమ్మల్ని అందరినీ పట్టుకోడానికే నేను ఇలా నటించాను




సశేషం 



Rate this content
Log in

Similar telugu story from Action