అతడుఆమె
అతడుఆమె
అతడు : అడవి పువ్వు లాంటివాడు
ఆమె : అచ్చమైన ఆడపిల్ల తను
ఇద్దరి ప్రేమ కథ
ఓడి గెలిచినదా!
గెలిచి ఓడినదా!
వాళ్ళిద్దరూ కలిసి నడిచిన కాలంలో
నవ్వుల వసంతాలు...
మురిసిన గులాబీలు...
వెన్నెల పువ్వులు...
విరహ వేదనలు...
విరిసిన వలపులు...
కలిసిన ప్రేమ...
వర్ణించ తరం కాని వన్నెలొలకబోసిన మనసుల సోయగాలు...
సరస సల్లాప సమీరాలు నెలవంక నగవుల నజరానాలు.
తాన తందాన గాన భజాన అంటూ ఆడిన గురుతులు.
వలదన్న వినదీ మనసు అంటూ వేడెక్కిన విరహలు.
వలపుల వసంతంలో తానాలాడిన మనసుల మధురిమలు.
అతని ప్రేమ ఆవేశం...
ఆమె ప్రేమ ఆద్యంతం...
అతని మౌనం వెన్నెల జలపాతం...
ఆమె మాటలు మంత్రాల గారడీలు...
అతని ప్రేమ ఆవేదనలు...
ఆమె ప్రేమ ఆరాటాలు...
వారి ప్రేమ - అనంతం..అమృతం..అద్వైతం...
ఆత్మల అనుబంధంగా మారి మురిసి తడిసి తడమే
వలపుల పిలుపులివే...
ఓడి గెలిచినదా!
గెలిచి ఓడినదా!
ఈ ప్రేమకథ...

