STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance

4  

ARJUNAIAH NARRA

Romance

యవ్వన మనస్సు

యవ్వన మనస్సు

1 min
485

నా ఆశ వసంత వృక్షం వలె  

విరుచుకొని బాహువులు పరుచుకున్నది

కోరికల జ్వాలలు కొండంత కోరలు చాపి

బుసలు కొడుతున్నవి

వయసు వయ్యారాలు ఉప్పెనల 

ఎగిసేగిసి తరుముతున్నవి

అధరాలు మధుర కడలి సంద్రమై

వెన్నెల రాత్రుల్లో అలలారుతున్నవి

వయసు మెరుపులో నా మేని

మిలమిలాడుతున్నది 

నీ మొహం నా ఎదలో

నయాగర జలపాతంలా 

పరవళ్లతో తొణికిసలాడుతున్నది

నా నరాలలో ఉడుకుతున్న మైకం 

ఉరుకులు పెడుతు నా మదిని

ఉహాలతో ఉల్లాసంగా ఉయ్యాలలుపుతుంది

నా దేహం నవలోకపు తన్మయత్వనికి

తహ తహలాడుతూ తరించిపోతుంది


నా యవ్వనం చివుళ్ళతో

ఒంటినిండా పచ్చగా నుగారు

అందాలు పరుచుకొని 

తీపి తలపులతో లేలేతగా

సిగ్గు మొగ్గలు తోడిగింది

కందిన బుగ్గలు కొరికి

చిందిన తుంపరలను పీల్చి

పండిన పండ్ల తొనలు జుర్రి

సలసల కాగుతున్న కోరికలను 

కోసరుగా మనసారా అందాలన్నీ ఆరగించి

యవ్వన పువ్వుల తోటలో విహారిస్తు

సూర్యుడు ఉదయించని రసరమ్యమైన

ఈ రేరాత్రి సామ్రాజ్యాన్ని ఏలుకుందాం, 

రా ప్రియతమా!



Rate this content
Log in

Similar telugu poem from Romance