యోచించుకో చెంచా నెంచుకో!
యోచించుకో చెంచా నెంచుకో!
యోచించుకో
చెంచా నెంచుకో!!
------------------------
మోజులకు రుచులకూ
అలవాటు పడిన నాల్కల్ని
అలరించాల్సిన దినుసులెన్నో
చిక్కుబడిపోయాయ్ కుప్పగా
ఎక్కడికక్కడే చెదరి హఠాత్తుగా
విశ్వవ్యాప్తంగా
పేట్రేగిన భయోత్పాతం
మరపిస్తోంది రుచుల్ని
తీరిస్తే చాలంటోంది ఆకల్ని
రక్షిస్తే చాలంటోంది ప్రాణాల్ని!
రోగాలు చుట్టుముట్టడం తో
భోగాలుకట్టుబడుతున్నాయ్
భాగ్యమేది అని అంటే?
ఆరోగ్యమె అని అంటూ
కళ్ళన్నీ నోళ్ళన్నీ కట్టుబడిపోతున్నాయ్
బ్రతికుంటే చాలంటూ
మధుమేహం
రక్తపోటు
కరోనాలను తలచుకుంటూ!!