యగాలైన
యగాలైన
కర్పూరపు వాసంతం..కరిగిపోదు యుగాలైన..!
తనపలుకుల మాధుర్యం..వీడిపోదు యుగాలైన..!
జాబిలికే గిలిగింతట..తనకవితా లత తాకగ..
నవపరిమళ ఆ గంధం..మరిగిపోదు యుగాలైన..!
కత్తికందనంత పదును..తొంగిచూచు కావ్యగరిమ..
అమృతమధుర రసభావన..ఆరిపోదు యుగాలైన..!
తిరుగులేని వ్యక్తిత్వపు..చిరునామా అతగాడే..
తెలుగుజాతి తనవెలుగే..మరచిపోదు యుగాలైన..!
"విశ్వంభర" తిలకమైన..జ్ఞానపీఠ సౌందర్యం..
ఆ అమలిన తత్వజ్ఞత..చెదిరిపోదు యుగాలైన.
