అడుగు ముందుకేస్తుంటే..దారి అదే చూపుతుంది..!
ఆలోచన బాగుంటే..దారి అదే చూపుతుంది..!
ప్రవహించే నదిలాగా..జీవించే విధమేదో..
తపనపడే మనసుంటే..దారి అదే చూపుతుంది..!
వెలిగించిన కొవ్వొత్తికి..ఏం తెలుసని అనుకోకోయ్..
స్వార్థత్యాగ గుణముంటే..దారి అదే చూపుతుంది..!
పదునుకత్తి కాదు మాట..అసలు ప్రేమ చినుకేనోయ్..
వర్షించే ఒడుపుంటే..దారి అదే చూపుతుంది..!
ఎవ్వరు ఎటు వెళితేనేం..గమ్యం చివరికి ఒకటే..
సాధనలో ఓర్పుంటే..దారి అదే చూపుతుంది..!
ఉన్నచోటనే ఉంటూ..లోకాలను చుట్టవచ్చు..
సంకల్పం తోడుంటే..దారి అదే చూపుతుంది..!