కోసం
కోసం
పరుగులెన్ని తీసేవోయ్..బంగారం కోసం..!?
బయటెక్కడ వెతికేవోయ్..బంగారం కోసం..!?
ఏకాంతపు మందిరాన..ఉన్ననిధిని పట్టక..
ఏ కొండను తవ్వేవోయ్..బంగారం కోసం..!?
భారమేదొ తోచిందా..చీకటితెఱ చీల్చగ..
ఏ మార్గం పట్టేవోయ్..బంగారం కోసం..!?
సాహసించ లేనినాడు..సాధిస్తా వేమిటి..
శోధనేమి చేసేవోయ్..బంగారం కోసం..!?
తోడెవ్వరు ఉంటారోయ్..స్వర్గమేదొ ఎక్కడ..
ఏ దిక్కుగ మొక్కేవోయ్..బంగారం కోసం..!?
కాలపు నదిలో ఖర్మల..సుడులలోన వేటా..
ఏ తీరుగ తిరిగేవోయ్..బంగారం కోసం..!?
