STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇంక

ఇంక

1 min
5



విన్నపాల పాలవరద..నిను ముంచను ఇంక..!
నీ బంగరు మేడ వదిలి.. నే వెళ్ళను ఇంక..!

నీవు నన్ను చూస్తున్నది..తెలిసిందని అనను..
నిను చూడక క్షణమైనా..నేనుండను ఇంక..!

ఏ చక్కెర పొంగలినే..పెట్టగలను నీకు..
నీ పదముల తేనె గాక..మరి పంచను ఇంక..!

చెలి చుట్టూ తిరుగుటలో..జన్మలెన్ని గడిచె..
ఇంక చాలు మాయపట్ల..మనసుపడను ఇంక..!

రాళ్ళు విసురు లోకానికి..జవాబు చిరునవ్వు..
పూలవాన జల్లేదో..నే కోరను ఇంక..!

నీ చూపుల నీడ గాక..గొడుగు పనేలేదు..
వేదాంతపు పాఠమేదొ..నే చెప్పను ఇంక..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Midhun babu

Similar telugu poem from Classics