STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఊరుకోను

ఊరుకోను

1 min
3



చెట్లనలా కొట్టేస్తే..అసలెలా ఊరుకోను..!?
ప్రేమ గుడులు కూల్చేస్తే..అసలెలా ఊరుకోను..!?

యుద్ధంతో సాధించే..విజయాన్నే ఆశించను..
అమ్మగుండె పేల్చేస్తే..అసలెలా ఊరుకోను..!?

అమృతమెలా ఉంటుందో..చెప్పగల్గు వారెవ్వరు..
తెలుగుపట్టు వదిలేస్తే..అసలెలా ఊరుకోను..!?

ప్రాణాలను అర్పించే..సైనికులా వెర్రివాళ్ళు..
సరిహద్దులు దాటేస్తే..అసలెలా ఊరుకోను..!?

స్నేహామృత మేఘంలా..బ్రతకువిద్య నేర్చిరెవరు..
శాంతిగొంతు నులిమేస్తే..అసలెలా ఊరుకోను..!?

నిత్యసత్య సంప్రదాయ..రక్షణెంత అవసరమో..
తాళిబొట్టు విసిరేస్తే..అసలెలా ఊరుకోను..!?


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Midhun babu

Similar telugu poem from Classics