STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పాటైనది

పాటైనది

1 min
3


వేదించే మాధుర్యం..రేయినోటి పాటైనది..!
అనురాగపు రాగఫలం..రేయినోటి పాటైనది..!

ఒక ఆరని చిచ్చురేపి..వెళ్ళుటెంత మనోహరం..
రేరాణీ సుమగంధం..రేయినోటి పాటైనది..!

వింటూనే విననట్లుగ..ఎందుకలా ఉంటావో..
వెన్నెల కత్తుల హాసం..రేయినోటి పాటైనది..!

ఆవేదన కన్న అసలు..లోకంలో మధువేదట..
గగనమంత నిశ్శబ్దం..రేయినోటి పాటైనది..!

మాయగాక ఉందేమిటి..కనిపించే ప్రపంచాన..
పలుకరాని ప్రియమౌనం..రేయినోటి పాటైనది..!

మదిలోయల పోటెత్తే..సంద్రాలను చూపనెలా..
వీడలేని అనుబంధం..రేయినోటి పాటైనది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Midhun babu

Similar telugu poem from Classics