ఈ మల్లెలు
ఈ మల్లెలు
నువు నవ్వక మొగ్గ..తొడగవులే ఈ మల్లెలు..!
అసలు చిగురుకూడ..వేయవులే ఈ మల్లెలు..!
ఈ మాయను దాటు..వేడుకలో నిలుపు కాస్త..
నా మోహం పట్టి..రాల్చవులే ఈ మల్లెలు..!
నీవు గాక ఎవరు..నా బాధను వింటారట..
ఆలకించ కరుణ..చూపవులే ఈ మల్లెలు..!
ఎంతగొప్ప చిలిపి..సుగంధాలు చిందేనో..
బందీ చేయకుండ..ఉండవులే ఈ మల్లెలు..!
నిన్ను గాక ఇపుడు..నమ్ముకోను దిక్కెవ్వరు..
మనసుగొడవ తీర్చ..చూడవులే ఈ మల్లెలు..!
కమ్ముకున్న తీపి..మత్తు వదిలిపోనీరా..
పుట్టిముంచు పనిని..మానవులే ఈ మల్లెలు..!
