STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చెట్లంటా

చెట్లంటా

1 min
9


ఈ పుడమిని రక్షించే..దేవతలే చెట్లంటా..!
కాలుష్యం తొలగించే..దేవతలే చెట్లంటా..!

ప్రేమకు ప్రతిరూపం ప్రతి..తరువున ఉన్నదిలే..
సుగంధాలు వర్షించే..దేవతలే చెట్లంటా..!

ఎన్ని జీవులకు ఆవాసాలో..తెలియని దెవరికి..
అనునిత్యం కరుణించే..దేవతలే చెట్లంటా..!

గింజలు ఆకులు పూవులు..పండ్లూ వేర్లతో సహా..
ఓషధులను అందించే..దేవతలే చెట్లంటా..!

స్వార్థత్యాగ గుణరాశులు..ఈ సృష్టికి మిత్రులు..
ప్రసాదాలు వడ్డించే..దేవతలే చెట్లంటా..!

సమభావం పెన్నిధిగా..కలిగిన తపోధనులు..
మమతలెన్నొ పండించే..దేవతలే చెట్లంటా..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics