STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పూలమాల

పూలమాల

1 min
3


నీ దయతో దయచూపెను..సన్నజాజి పూలమాల..!
నీ ప్రేమను ప్రకటించెను..సన్నజాజి పూలమాల..!

నమ్మలేను ఇది నిజమని..ఎందుకంటె ఏం చెప్పను..
కలలోలా కనిపించెను..సన్నజాజి పూలమాల..!

దరిశనమే కరువైనది..దరికి చేరుటెన్నడులే..
విరహములో ముంచేసెను..సన్నజాజి పూలమాల..!

తలనిమిరే గాలి కూడ..నీ పక్షంలా ఉన్నది..
గొప్ప చిచ్చు రగిలించెను..సన్నజాజి పూలమాల..!

నీ చెలిమిని ఆశించుట..నేరమనే అనుకొందును..
నా వెర్రికి ఫక్కుమనెను..సన్నజాజి పూలమాల..!

గుండెకెంత గుబులంటే..ఆగి ఆగి ఆడుతోంది..
మౌనముగా పరికించెను..సన్నజాజి పూలమాల..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics