STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

యేటి ఒడ్డునున్న చెట్టు

యేటి ఒడ్డునున్న చెట్టు

1 min
4



యేటి ఒడ్డున వున్న చెట్టుదొక అదృష్టం 
తన నీడ తాను చూసుకొనే దృష్టాంతం 
పచ్చపచ్చని వయ్యారానికి సిగలోని పూలు
తన మేని ఛాయను నిత్యం ఆస్వాదించే వీలు

ఒడ్డున నున్న చెట్టు ప్రతిబింబం యేటిలో
నీటి అలలపై నిశ్శబ్దంగా ఊగే మోజులో 
కొమ్మలన్నీ విరబూసిన జుట్టులా అలల అలలు 
కొమ్మజెడలోని విరులన్నీ ఊహల్లో ఊయలలు 

అదే విధంగా ఏరుది కూడా అదృష్టమే
యేటి ఒడ్డుననున్న చెట్టు చేమలొక రక్షణ
తన దేహ క్షయానికి దాపుగా వృక్షరాజాలు
పరస్పర జీవనం ప్రకృతిచ్చిన నజరానాలు 

పుడమిపై పంచభూతాలతోనే పర్యావరణం 
నింగీ నేల, నీరు నిప్పు, గాలి కలిస్తే ఆవరణం 
ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు 
తమ మనుగడకై ఇవ్వన్నీ కాపాడాల్సిన నరులు

ప్రకృతి అందాలకు ఏరులు, సెలయేళ్ళు
అందాల సింగారాలకు పూలు, పుప్పొళ్లు
రంగురంగుల పూలతో వనమంతా పసందు
పక్షుల కిలకిల రావాలతో వీనులకు విందు 

యేటి ఒడ్డున అందాలన్నీ నీటిలో క్రీనీడలు 
తలకిందులుగా కనబడే కమనీయ దృశ్యాలు 
చెట్ల దాపున బతికే జీవులకు యేరొక దాహార్థి
జీవజాలం సందడితో నదులకో సంతృప్తి

చెట్లు లేనిదే నీరు లేదు, నీరు లేనిదే జీవం లేదు 
జీవ వైవిధ్యానికి జలమే కదా జీవనాధారం 
అందాల అనుసంధానానికి అన్నీ అవసరం 
జీవజాతులు సమతుల్యతకు నీరే ఒక వరం


Rate this content
Log in

Similar telugu poem from Classics