వ్యర్థము
వ్యర్థము
కలతలు తీర్చని బంధము ఎంతగ పెంచిన వ్యర్థము
వాసన చూపని ఎన్నో సుమములు విరిసిన వ్యర్థము
ప్రేమలు పంచని మనుషుల తీరే చూడగ వింతే.
సారము లేనీ కవితలు వరదగ పారిన వ్యర్థము.
చుక్కల మధ్యన చంద్రుడు వెలిగే ప్రభయే రమ్యము
తిమిరము జాడలొ చంద్రుని కాంతిని వెదికిన వ్యర్థము
తలచిన చాలును పిలిచే దైవము తోడుగ ఉండును
మనసులొ నిర్మల చిత్తము లేకనె వేడిన వ్యర్థము...
మాటయె చిన్నది గాయము పెద్దది చేయుట సులభము
మానని గాయము గేయము కానిది రాసిన వ్యర్థము..
