వసంతుడు
వసంతుడు




వసంతుడు రాలేదని వనమలిగింది
సరిగ్గా నేను రాలేదని నువ్వు అలిగినట్లు
తేనెటీగ అతిథి కోసం పూవొకటి ఎదురు చూసింది
నాకోసం నువ్వు ఎదురు చూసినట్టు
సఖీ
నీ యద చప్పుడు వినాలని
నిను నా కౌగిలిలో బంధించాలని
పరుగెత్తుకు వస్తున్నా
నీ వాడిని అయ్యేందుకు తపములెన్నో చేస్తున్నా