"వసంతకాలం"
"వసంతకాలం"
మోడుబారిన జీవితాన
కన్నీళ్లు మాత్రమే మిగిలిన క్షణాన
నీరాకే శిశిరం వెనక వచ్చే వసంతమే
అందుకే అయ్యింది నా జీవితం అరవిరిసిన కుసుమమే
ఆకులుగా రాలిన ఆశలకు కొత్త చిగురు వేయించావు
నవ్వులనే పువ్వులు పూయించావు
నా హృదయ బృందావనంలో కన్నయ్యగా మారి
నీ చిలిపి చేష్టలతో నందనవనంగా మార్చేసావు

