వృక్షవిలాపం
వృక్షవిలాపం


ప౹౹
చెట్లు మాటాడితే చెడామడా తిట్టేస్తాయి
ఒట్లువేసి మనిషికి దూరంగా జరిగేస్తాయి ౹2౹
చ౹౹
కమ్మనిగాలి ఇచ్చినందుకు కనికరమేదని
చల్లని నీడను పరచినందుకూ చంపావనీ ౹2౹
నోరు తెరచి నిన్నూ నిలబెట్టి కడిగేస్తాయి
భోరుమని రోదించి పెద్దగానే విలపిస్తాయి ౹ప౹
చ౹౹
పచ్చదనాన్ని చేయగ సుష్టుగా ఫలహారం
కచ్చతనాన్ని చూపి కోరూ మరి పరిహారం ౹2౹
అడ్డదిడ్డంగ అడవిని చేసినందుకే నాశనం
చెడ్డదినములే చేరి చేయు పెద్ద వినాశనం ౹ప౹
చ౹౹
నీడనిచ్చిన తమకే నిలువనీడ లేనందుకు
కీడునే తొలగించి మంచి గాలిచ్చినందుకు ౹2౹
జాడలనే తొలగించే జనావళిని శపిస్తాయి
జాడలేకుండా చేస్తున్న వారిపై కోపిస్తాయి ౹ప౹