వృక్షోరక్షతిరక్షిత:
వృక్షోరక్షతిరక్షిత:
మొక్కనొకటి నాటి చక్కగా పెంచిన
కొలదినాల్లకదియు ఫలము లిచ్చు
హాయిగొలుపు గాలి నదించు మనిషికి
చెలిమిచేయ వోయి చెట్ల తోడ
బ్రతుకుతెరువు కొరకు వనముల నరికిన
వృష్టిలేకరైతు నష్ట పోవు
తిండిలేక జనులు తిప్పలు బడుదురు
వృక్షరక్ష జాతి పెంపు గాదె!
ప్రాణమున్న నాడు పరులకే సర్వమ్ము
దార వోయి నట్టి త్యాగ జీవి
నేలరాలి పోయి నిండైన దేహమ్ము
నర్పితమ్ముజేయు నమరజీవి
కరువుదీరి పోవు తరులను పెంచిన
కనులస్వర్గ సీమ కదలి యాడు
భ్రమలుతొలగి పోయి రైతు గుండెలలో
ప్రగతిపల్లె పాట పరవశించు