STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

వ్రాయాలా ప్రేమ లేఖ

వ్రాయాలా ప్రేమ లేఖ

1 min
3

మనసుసరిగ తెలియలేక..ఇవ్వాలా ప్రేమలేఖ..! 

చూపులతో కాకుండా..వ్రాయాలా ప్రేమలేఖ..! 


నేనేమో తనకోసం..పడిగాపులు ఈ తోటన.. 

ఈలవేయు గాలిలోన..నింపాలా ప్రేమలేఖ..! 


తలపులలో ప్రవహించే..వలపునదిని చూపుటెలా.. 

మెఱుపువీణ శృతిచేసుకు..పాడాలా ప్రేమలేఖ..! 


విరహమెంత అద్భుతమో..గున్నమావి చివురులా.. 

కోకిలప్రియ రాగంలా..పొంగాలా ప్రేమలేఖ..! 


ఆవేదన తోడుచుక్క..కనుపాపల పాలలోన.. 

గోర్వెచ్చని హాసంలో..చిందాలా ప్రేమలేఖ..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance