వలపుల సూత్రం
వలపుల సూత్రం
నా నువ్వు. నాకేమవుతా వంటే ఏమని చెప్పేది
నీ నవ్వెనిలిచిపోవాలంటే ఇంకేమి చేసేది నీకై సతతం
జపించి తపించేను నీపై అక్షరాలతో వింజామర వీస్తాను
నా ఉషోదయం నీవునా సందెపొద్దు నీవునా హృదిమాటవి నీవు
నా మదిపాటవి నీవునా గుండెలయ నీవునా ప్రణయఝరి నీవు
నా నవ్వే నీవునా నువ్వే నీవునా మిన్ను నీవు నా భువే నేవు
నా మనసే నీవు నా మమతే నీవు నా తలపే నీవు నా కలిమే నీవు
నా రాగం నీవునా సరాగం నీవునా రతివి నీవునా అనురక్తివి నీవు
నా సన్మతి నీవునా సద్గతి నీవు నా స్వరము నీవునా సర్వము నీవు
నా పరువు నీవునా పౌరషం నీవు నా గమనం నీవు నా గగనం నీవు
నా ఆనందం నీవునా విషాదం నీవునా ఆలోచన నీవునా కలవరం నీవు
నా స్నేహవల్లరి నీవునా ప్రేమమంజరి నీవునా వయసువేడి నీవు
నా వలపాహారతి నీవు

