వలపు ఊహలు
వలపు ఊహలు
తొడగని రెక్కల..పిట్టయె తానే..! పుప్పొడి రాగపు..వానయె తానే..!
చేనుల పసిడిని..పాలించేనుగ..నిండే పాలకు..ఊటయె తానే..!
చివురులు తింటూ..పాటయ్యేనా..కోకిల పదముల..కొమ్మయె తానే..!
నవ్వుల గలగల..యేటికి చెలియా.. వాగుల వంకల..వరదయె తానే..!
మనుగడ సాక్షిగ..మిగిలే దెవరట.. మౌనం విరిసిన..తోటయె తానే..!
మంచున దాగిన..మెఱుపే సఖియా.. పలుకుల కందని..ఊహయె తానే..!

