వలపు తలపులు
వలపు తలపులు


ఎందుకో నాకు ఈ ఆశలు
ప్రతి రోజూ శ్రావణ మేఘపు జల్లుల గురుతులు
నిను తలచిన ప్రతి సారీ కాంక్షల నిప్పులు
వయసు వాటికలో నీకోసం ప్రేమ యజ్ఞాలు
ఫలించనీ సఖీ
నా మౌన రాగ ఆలాపనలు
నీ హృదయం రంజిల్లి
నన్ను మనువాడి
నీవుంచు ప్రతి ఉదయం నా వలపుల వాకిట రంగవల్లి