వివిధ వర్ణాలు
వివిధ వర్ణాలు
నలుపు
తెలుపు
రెండే కాదు
మరెన్నో వర్ణాలు
ఓ నీడన చేరాయి
అందరిలోని చికాకునీ
పక్కకు తీసేసి
లెక్కల అధికారాలు
గాలికి వదిలి
పచ్చని ప్రకృతిలో
నాగరికత గురించి
చర్చలు జరిపారు
అన్ని రంగుల మనుషుల్లో
ఒక్కటే ఆకర్షణ
నవ్వు
మాటకి నవ్వు
ఆటకి నవ్వు
పాటకి నవ్వు
ప్రతి పదానికీ కొత్త అర్థాలు
అన్నీ మంచివే
సమూహం మధ్యలో
అస్థిత్వం కోసం తపించే
ఓ బాటసారీ
నువ్వన్నీ తిరిగే వచ్చావు
ప్రతి రంగులో నువ్వే ఉన్నావు
