STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

విరహంతో

విరహంతో

1 min
3

ఎర్రకలువ కొలనేమో..వేగుతోంది విరహంతో..!

కలువబాల మనసేమో..కందుతోంది విరహంతో..!


తన జాబిలి వస్తాడని..కోటికనుల ఎదురుచూపు..

కానరాని వలపేమో..మరుగుతోంది విరహంతో..!


ప్రేమగాయ మెవరితరము..సరిగ తెలిసి మాన్పేందుకు..

చెలియపూల సొగసేమో..అలుగుతోంది విరహంతో..!


కలువమొగ్గ లెన్నొ కూడి..పానుపైన లాభమేమి..

తన తనువున తాపమేమొ..రగులుతోంది విరహంతో..!


వెన్నెలింట వేడుకగా..తొలిరేయికి సన్నాహం..

ఎందుకనో ఏ మాయెనొ..మిగులుతోంది విరహంతో..!



Rate this content
Log in

Similar telugu poem from Romance