STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

విరబోసిన విరులు

విరబోసిన విరులు

1 min
372

విరబోసిన విరులల్లె జాలువారు జలపాతం 

భేదాలే చూపనిది ఖేదాలే బాపేది ఈ వెన్నెల 

నెలవంకై విరబూసిన చిరుమందహాసం

రేయిపడ్డ కష్టానికి బడలికయే వెన్నెల జలపాతం


ఆకాశదీపమై అలరారు చందమై అందమైన కౌముది

గుబులునిండిన హృదికైనా అధరాలు విరబూయు 

కొండకోన వాలులోన తరువులు విరబూసే 

కాళరాత్రి కురులలోన ఒదిగినాది సిగపూవై


అడవంతా పరుచుకున్న పడుచుపిల్ల పరువంలా

యామిని విచ్చుకున్న పలువరసల ధరహాసమై

కడలిఅలలా మబ్బుకదలి దోబూచులాడే వెన్నెలమ్మ ఒడిలోన

శీతలగాలులతోడ అమృతం కురిసిన వెన్నెలరాతిరి



Rate this content
Log in

Similar telugu poem from Romance