వింతగా
వింతగా
కొంటె చూపుకు లేని కోపం..నీకు ఎందుకు వింతగా..!?
రెండు జడలకు లేని విరహం..నీకు ఎందుకు వింతగా..!?
మండుటెండను మంచు దుప్పటి మల్లె మార్చెద ఓ చెలీ..!
మల్లె తీగకు లేని తాపం..నీకు ఎందుకు వింతగా..!?
సమయవీణా మధుర సుధలను విందు చేసెద ప్రియ సఖీ..!
రేయి-పగలుకు లేని కలహం..నీకు ఎందుకు వింతగా..!?
స'రస జగతిని మునకలేయగ సంశయాలిక వీడవా..!?
నీలిమబ్బుకు లేని దాహం..నీకు ఎందుకు వింతగా..!?
ఇంద్ర ధనువుల ప్రణయ జగతిగ మనసు నిలిపితి చూడవా..!?
తీపి వలపుకు లేని అద్దం..నీకు ఎందుకు వింతగా..!?

