STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

విన్నపం

విన్నపం

1 min
312


ప||

కరిసే మేఘమా ఈ విన్నపాన్నీ ఆలకించవా

విరిసే కుసుమంలా ఉత్తరాన్నీ తిలకించవా ౹2౹


చ||

గతమెక్కడో గమనమే మరచిన ఆ వలపేన

జత కలిసిన జ్ఞాపకం మరి మరులు కలపేన |2|

ఇరువురుని ఇంపుగా చూసిన ఓ మేఘమా

తెరువరికి తెలుప కదలిరావా మనోవేగమా

|ప|


చ||

కొసరి ఆ గురుతులే గుట్టుగా గుబాళించిలే

మసకేసిన ఆనవాళ్లే మసకగా ప్రకాశించిలే |2|

ఏరి కోరి ఎదలోని ఎలమినే వెలికి తీయవా

చేరి మరి ఆ చేతలతోనే చెలిమినే చేయవా

|ప|


చ||

శ్రావణ మేఘమే శ్రమించి వృష్టినే కురిపించె

శ్రావ్యమైన రాగం అనురాగంతో మురిపించె |2|

జాగేల జవరాలి జాడ కనుగొని కలుసుకొన

కాగల కార్యం నీవే తీర్చ వలెనే తెలుసుకొన

|ప|



Rate this content
Log in