Varanasi Ramabrahmam

Inspirational

4  

Varanasi Ramabrahmam

Inspirational

విమోచనం పొందిన లలనలు

విమోచనం పొందిన లలనలు

1 min
23.5K


తల్లులమై, ప్రేమ వల్లులమై,

అనురాగ మల్లెలమై, మమతా వల్లరులమై, ఆత్మీయతా లహరులమై, వ్యథ, వేదనలకు 

ఔషధములమై, ఇల్లే మేమై అలరిన,

అలరించిన ఇంతులము మేము:


ఇక మీదట ఈ పాత్రలు పోషించడం ఆపి,

మా చదువు, ఉద్యోగం, తత్సంబంధ విషయములపై మాత్రమే మా దృష్టి;

ఇతరములు మా బాధ్యతలు కావు; 

హక్కుల పరిధిలో లేవు; ఇకపై మేము

విమోచనం పొందిన లలనలము;


ఇంటికి, వంటిటికీ,

పడకటింటికీ పరిమితమైన

ఇల్లాళ్ళము, గృహిణులము కాము

ఉద్యోగస్థులము; స్త్రీ పురుషులు సమానము


Rate this content
Log in

Similar telugu poem from Inspirational