విజయరథం
విజయరథం


అభ్యుదయం మోడీ రధం
కదిలెను మనతో
సారధి సాధన పరిగెడి మనతో /ఓ అభ్యుదయం /
రాష్ట్రాల సారధులు ఎత్ తే ధ్వజం
చేదోడై సాగిరి అధికారులు /ఓ అభ్యుదయం /
పారిశుధ్య కార్మికులు పరిశుభ్రతకు
పోలీసు శాఖ మొత్తమ్ మన రక్షణకు
డాక్టర్లు నర్సులoతా మన సేవలకు
చేరిరి ఒక్కటిగా పరిరక్షణకు.. /ఓ అభ్యుదయం /
గ్రామ పెద్దలు మరి ప్రజలందరూ
చేరిరి చెట్టుకింద ఒక్కమ్ముడిగా
రధ సారధి చెప్పినవి ఆచరించిరి
సామాజిక దూరాన్ని పాటించిరి /ఓ అభ్యుదయం /
పేదలను కాపాడు దైవము లంతా
ఒక్కటై చేయూతను అందించిరి
పెద్ద పెద్ద ధనవంతులు అండగా నిలిచే
దేశానికి రాష్ట్రానికి అండగా నిలిచి
అందరికి ఆదర్శం అయ్యారండి... /ఓ అభ్యుదయం /...