వెన్నెలమ్మ(మొదటి భాగం )
వెన్నెలమ్మ(మొదటి భాగం )
మనసు ఎలా ఉండాలో..చూపుతుంది వెన్నెలమ్మ..!
వ్రాయాలని మనసైతే..నేర్పుతుంది వెన్నెలమ్మ..!
ప్రణయవీణ తంత్రులలో..ప్రతిరాగం తన సొంతం..
అనురాగపు సంగతులను..ఒలుకుతుంది వెన్నెలమ్మ..!
ప్రణవసుధా తరంగిణీ..మాధురియే తన మౌనం..
ప్రేమ గగన వీధులలో..త్రిప్పుతుంది వెన్నెలమ్మ..!
ప్రతి ఊహకు మెఱుపులద్దు..చైతన్యపు నిధి తానే..
భావామృత రసఝరియై..దూకుతుంది వెన్నెలమ్మ..!
సిగ్గుపడే చెక్కిలింటి..సోయగాల రాశి కదా..
చెలివలపుల వారాశిలొ..మునుగుతుంది వెన్నెలమ్మ..

