వెన్నెలలో ఆడపిల్ల
వెన్నెలలో ఆడపిల్ల
నిన్నలలో అందమెంతొ గడుసుగానె చూపిస్తివి..!
వెన్నెలలో ఆడపిల్ల సొగసింతని మురిపిస్తివి...!!
విషాదాలు మదిచేరిన గురుతులేవొ నాకున్నవి!
ప్రణయసుధా వీచికలను వలపులతో కవ్విస్తివి..!!
మాటరాని మౌనమేదో నా మనసును కాటేస్తే,!,
కనురెప్పల ఉప్పెనేదొ కానుకగా, వరమిస్తివి..!!
కొండ, కోన ,వాగు,వంక మన ప్రేమకు సాక్ష్యాలే...!,
వెండివాన వెలుగుల్లో పిడుగులనే కురిపిస్తివి..!!
వియోగమనె బాధనంత పెదవంచున మోస్తున్నా !
పెను చీకటి వలయంలో తిరుగుమనీ శాసిస్తివి..

