వెన్నెలా...
వెన్నెలా...
కురిసెనే వెన్నెలా............
రేయి వన్నెల మిన్నులా..........
విరిసెనే కలువలా............
వేయి రేకుల కనులలా............
కనురెప్పపై కల అలా...........
కనిపెట్టదా కమ్మని వలా............
అలసిన అల ఎగసేనలా............
అలరించు జాబిలి కిరణాలలా............
మెరిసెనే ప్రకృతి కళా............
మురిసెనే పున్నమి ఇలా............
మరిచెనే తనువింతలా.............
మరులు గొలిపే రాత్రిలా............
కమ్మని నిదుర కన్నులా............
రమ్మని పిలిచేటి వేళలా............
సోయగాల జాబిల్లి వేసెనే సోకుల వలా.............
నయగారమే చూపించగా అవని వలపుల మాలలా...
అల్లుకోదా నన్నిలా.............
ప్రియమారా పాడే జోలలా............

