వెన్నెల...
వెన్నెల...
విరజాజులు విచ్చుకోవా
నీ రాకతో కలువలు కునుకు తీయవా
నీ చల్లని నీడలో కుసుమాలు
కన్ను గీటవా నీ కాంతులు చూసి విశ్వమంత
వదిలి నా వైపుగా కదిలావా
ఆకాశమే హద్దుగా విచ్చుకున్నవా
నా రేయిని నీ నీడలో తలదాచుకొని
నిను వీక్షించనా నీతో విహరించనా
నేనే నిదురించనా ఓ వెన్నెల...
... సిరి ✍️

