STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

వెన్న

వెన్న

1 min
404

పాలల్లో దాక్కుని దోబూచులాడుతుంది 

మజ్జిగ చిలక గా నేనున్నాను ఓచ్ అని పైకి తేలుతుంది 

చిక్కింది అని చేతుల్లోకి గబుక్కున తీసుకోబోతే జారుకుంటుంది. 

మృదుమధురమై శ్రీకృష్ణుని మనసుని దోచుకుని 

"వెన్న దొంగ"గా మార్చింది

ముట్టుకుంటే కరిగిపోయే "వెన్న" అగ్నికి జత అయ్యి కమ్మటి నేతిని ప్రసాదిస్తుంది.

అల్పాహారం లో రొట్టె ముక్కలపై ఒద్దికగా ఒదిగిపోయి పిల్లల నోటికి కమ్మదన్నాన్ని ఇస్తుంది

పౌష్టికత లో మేటి అయి అందరి మనసులను 

దోచుకున్న రారాజు 

"వెన్నవంటి" మనసు అన్న కిరీటాన్ని ధరించింది  

ఈ "వెన్నపూస".


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational