STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వేట కోసం..

వేట కోసం..

1 min
223

నక్కల ఊళలు వినిపిస్తుంటే 

మెరిసే మెరుపులు

కొత్త దారిని చూపిస్తుంటే


కన్నులు తీక్షణంగా చూస్తూ

గమనిస్తుంటే

గుర్రపు శ్వాసలు తీవ్రంగా అనిపించాయి

రాజో సైనికుడో

వచ్చిన వాడెవడో 

అని చెట్లు గుసగుసలాడుకున్నాయి


దూరంగా నీటిలో అలికిడి

ఏదో జంతువా

అతనికి ఆహారం కాబోయేది ఏమిటో

ఎవరో

ఏ మనిషో పారిపోయి 

ఇక్కడ తలదాచుకోలేదు కదా


బుల్లెట్టుకి అవన్నీ అనవసరం

అతని చెయ్యి తుపాకీని గట్టిగా పట్టుకుంది

గురి తప్పిందా

లేదా

ఆమె అక్కడ ఉందని

కావాలనే గురి తప్పించాడా

అతని వేటకు ఫలం దక్కినట్టు అనిపించింది

ఆ క్షణం

అడవినతను జయించినట్లనిపించింది..


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Abstract