వేసవి కాలం
వేసవి కాలం
సెగలు పుట్టించే సూరీడు
చిరాకు తెప్పించే చెమట
అప్పుడే తెంపిన మామిడికాయలు
ఉప్పూ కారం నంజుకుని తినే పిల్లలు
వేసవి సెలవుల్లో ట్యూషన్లు
ఎగ్గొట్టేందుకు ఎన్నో పాట్లు
తాటి ముంజలు
ఐస్ క్రీం బండి గంటలు
షర్బత్ నాలుకకు అంటించిన రుచి
ఎండబెట్టిన దోస గింజలు
ఊరగాయకు కోసిన పుల్లటి మామిడి ముక్కలు
పక్షుల కోసం మట్టి పాత్రల్లో నీళ్ళు
పెరట్లో మల్లె తీగ గుబాళింపులు
అమ్మమ్మ ఇంటికి ప్రయాణం
పల్లెలో జాతర
రాత్రి వేళ
వెన్నెల్లో ఆరుబయట భోజనాలు
పడక్కుర్చీలో సేద దీరిన తాతయ్య
ఆయన చెప్పే కథలు
లైబ్రరీకి వెళ్లి తెచ్చుకున్న ' బుడుగు '
వేచి చదివిన ' చందమామ '
మళ్లీ స్కూల్లో చెప్పడానికి
ఎన్నెన్నో జ్ఞాపకాలు
మళ్లీ వేసవికి
ఉష్ణోగ్రత పెరిగింది అంటూ వచ్చే వార్తలు
సెలవులు మొదలు
