STORYMIRROR

Jyothi Muvvala

Drama Tragedy Action

4  

Jyothi Muvvala

Drama Tragedy Action

వేదిక

వేదిక

1 min
275

 


ఓ వేదిక కావాలిప్పుడు

నిజాలను విత్తనాలుగా వెదచల్లటానికో

సమస్యలను 70mm షోలో చూపేందుకో

అన్యాయాలను అరాచకాలను

 చీల్చి చెండాడేందుకి కాదు!


రంగురంగు సీతాకోకచిలుకలు తుమ్మెద పై వాలినట్టు

జాతికోక చిలుక జాతిరత్నమై

ప్రేమ జోష్యమో

ప్రణయ కావ్యాలో

రాజకీయలో చేసుకోవడానికి!


వాస్తవాలను చూడలేని గుడ్డివారై

చీకటిలో మిణిగురులా 

పగటిపూట చుక్కలుగా 

స్వతహాగా ఎదగలేని పిరికివారై 

గొర్రెల మందలో ఒకరైన వారికి కావాలి వేదిక!


ప్రభంజనమైన జనరంజకంగా సాగుతున్న సభలో

ప్రజలను ఆకర్షించే గారడీ తప్ప 

ప్రపంచానికి పనికి వచ్చేదేమీ లేదని తెలిసినా 


గొర్రె కసాయినే నమ్ముతుందనే నానుడి 

నిజం చేయడానికి 

వేదిక కావాలిప్పుడు

వేషాలను చూపేందుకు

వెర్రి వాళ్లను చేసేందుకు !!


జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Drama